Share News

AP NEWS: గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్య

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:19 PM

గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీ ( NTR Colony )లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య రామలక్ష్మిని భర్త సూర్యనారాయణ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా గాయపరిచాడు. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో రామలక్ష్మికి వివాహం జరిగింది.

AP NEWS: గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్య

గుడివాడ: గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీ ( NTR Colony )లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య రామలక్ష్మిని భర్త సూర్యనారాయణ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా గాయపరిచాడు. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో రామలక్ష్మికి వివాహం జరిగింది. భర్తతో విబేదాల కారణంగా, నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటోంది. భార్యాభర్తలు వివాదంపై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని సూర్యనారాయణను రామలక్ష్మి కుటుంబ సభ్యులు పిలిపించారు. రామలక్ష్మి ఇంటిలో పనులు చేసుకుంటుండగా భర్త సూర్యనారాయణ పొడిచి చంపేశాడు. ఈదాడిలో గాయపడిన రామలక్ష్మి తండ్రిని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం ఆస్పత్రికి తరలించారు. భార్య రామలక్ష్మిని చంపేసిన భర్త సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుడివాడ 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Dec 24 , 2023 | 03:19 PM