Share News

Janasena: గుడివాడ జనసేన పార్టీకి షాక్.. యువత రాజీనామా

ABN , First Publish Date - 2023-11-23T13:24:22+05:30 IST

Andhrapradesh: గుడివాడ జనసేన పార్టీకి షాక్ తగిలింది. పార్టీ యువ నేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కె) తన అనుచరగణంతో కలిసి జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

Janasena: గుడివాడ జనసేన పార్టీకి షాక్.. యువత రాజీనామా

కృష్ణా జిల్లా: గుడివాడ జనసేన పార్టీకి (Janasena Party) షాక్ తగిలింది. పార్టీ యువ నేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కె) (Dr. Macharla Ramakrishna) తన అనుచరగణంతో కలిసి జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. గురువారం తన అనుచరగణంతో కలిసి పార్టీ సభ్యత్వానికి మాచర్ల రామకృష్ణ రాజీనామా చేశారు. పదిమందికి మేలు చేసే వ్యక్తులకు మద్దతు ఇస్తానని.. గుడివాడ ప్రజలకు మంచి జరగడమే తన అంతిమ లక్ష్యమని డాక్టర్ ఆర్కే అన్నారు. కృష్ణా జిల్లాలో కార్యకర్తలను పట్టించుకునే నాయకుడు లేరని.. గుడివాడలో జనసేన నేతలు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. పార్టీ నేతల వ్యవహారశైలి మారకుంటే జనసేనలో నాయకులే మిగులుతారన్నారు. పదేళ్లుగా పవన్ పేరు జపిస్తూ, జనసేన జెండా భుజాలపై మోస్తూ... పార్టీ పేరు మీద యువత అంతా కలిసి వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడేడి... జిల్లా కమిటీలు కూడా వేయలేని స్థితిలో జనసేన పార్టీ ఉందన్నారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి తామంతా రాజీనామా చేస్తున్నామని డాక్టర్ ఆర్కే వెల్లడించారు.

Updated Date - 2023-11-23T13:24:23+05:30 IST