TDP Leader: ఏపీలో ఎన్నికలపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-28T11:00:58+05:30 IST
ఏపీలో ఎన్నికలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్/అమరావతి: ఏపీలో ఎన్నికల (Andhrapradesh Elections) పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు (TDP Leader Bonda Umamaheshwar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఏబీఎన్ (ABN - Andhrajyothy)తో మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనసేనతో పొత్తు నిర్ణయం.. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Janasena Chefi Pawan kalyan)లు కలసి తీసుకుంటారని చెప్పారు. పది కోట్లు కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు పది వేల రూపాయల ఖరీదు కూడా చేయరని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలుపై వైసీపీ చెత్త ఆరోపణలను బోండా ఉమా ఖండించారు.
కాసేపట్లో పొలిట్‌బ్యూరో సమావేశం
మరోవైపు హైదరాబాద్ ఎన్టీఆర్‌భవన్ (NTR Bhavan) తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం (Telugu Desam Party Polit Bureau meeting) మరికాసేపట్లో జరుగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief) ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన 32 మంది పొలిట్ బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణ (Telangana)కు సంబంధించిన నాలుగు అంశాలపై పాలిట్ బ్యూరో చర్చించి తీర్మానం చేయనుంది.
సమావేశంలో చర్చించే అంశాలు ఇవే....
1.అకాల వర్షాలు, పంట నష్టం - కష్టాల్లో రైతాంగం
2. రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు
3. ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాల సమీక్ష
4. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, సాధికార సారధులు