ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: ఈరోజు అమ్మకు బాలేదన్నాడు.. రేపు ఇంకేం చెబుతాడో!.. అవినాశ్‌పై బోండా ఉమా ఫైర్

ABN, First Publish Date - 2023-05-19T12:01:27+05:30

మాజీ మంత్రి వైఎష్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి వైఎష్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా (TDP Leader Bonda Uma) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐకి (CBI) దేశంలో అందరూ భయపడుతుంటే ఏపీలో వైసీపీ మాత్రం సీబీఐని భయపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డి పక్కాగా దొరికిపోయినా.. ఇప్పటి వరకూ సీబీఐ అరెస్ట్ చేయలేకపోయిందన్నారు. సీబీఐ విచారణకు పిలిచిన ప్రతీసారి ఎదో ఒక వంకతో అవినాష్ రెడ్డి తప్పు కొంటున్నారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు అమ్మకు ఆరోగ్యం బాగోలేదని... రేపు మా ఇంట్లో కుక్క పిల్ల తప్పి పోయిందని చెబుతాడేమో’’ అంటూ యెద్దేవా చేశారు. దేశంలో ఇప్పటి వరకూ సీబీఐ ఈ విధంగా ఎవరికి కూడా అవినాశ్‌కు లాగా ఉదాసీనంగా ఉండలేదన్నారు. ముందస్తు బెయిల్ కోసం అవినాశ్‌ రెడ్డి వందల కోట్లు ఖర్చ పెట్టాడని.. ఆ డబ్బులు ఎక్కడివి.. ఎవరిచ్చారని ప్రశ్నించారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి చిన్న చేప అని... అసలు తిమింగలాలు ఇంకా ఉన్నాయన్నారు. చిన్న చేపే సీబీఐని ఈ విధంగా చేస్తే తిమింగలాలు ఏమి చేస్తాయో అంటూ బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-19T12:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising