Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?

ABN , First Publish Date - 2023-06-16T15:27:43+05:30 IST

చంద్రబాబు గతంలో తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతోనే వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండ బట్టే..

Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?
Bonda Umama

అమరావతి: సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని రక్షించాలని జగన్ రాష్ట్రాన్ని ఏం కాపాడతారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ప్రశ్నించారు. బొండా ఉమ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో విశాఖ కేంద్రంగా కబ్జాలు, దోపిడీలకు పాల్పడిన విజయసాయి, మంత్రులు, ఎమ్మెల్యేలు పెంచి పోషించిన విషసర్పాలే ఇప్పుడు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాయి. రౌడీషీటర్ల సాయంతో ఎంతో మంది భూములు కబ్జా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే రౌడీలు, గూండాలకు భయపడాల్సిన దుస్థితి. విజయసాయిరెడ్డికి, ఎంపీ సత్యనారాయణకు గతంలోనే కొట్టేసిన భూములు, ఆస్తుల విషయంలో అభిప్రాయబేధాలొచ్చాయి. ఒకరి బాగోతం ఒకరు మీడియా సాక్షిగా బయటపెట్టుకున్నారు. ఎంపీ సత్యనారాయణ ఒక రూపాయి లీజుతో వేలకోట్ల విలువైన భూముల్ని డెవలప్‌మెంట్‌కు ఎలా తీసుకున్నారు? రౌడీషీటర్ల సాయంతోనే ఆయన దాన్నిసాధించారు. ఆడిటర్ జీవీకి ఎంపీ ఆస్తులకు, జీవీకి ముఖ్యమంత్రికి అవినాభావ సంబంధముంది? దొంగలు దొంగలు ప్రజల ఆస్తులు కొట్టేసి.. వాళ్లలో వారికే పడకనే చివరకు కిడ్నాప్‌ల వరకు వచ్చింది. విజయసాయి స్థానంలో వై.వీ.సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకు వెళ్లడంతో.. ఆ ప్రాంతంలో భూకబ్జాలు, దోపిడీలు, లూఠీలు మరింత పెరిగాయి. తన భుజానికి చిన్నకోడికత్తి గీసుకుంటే.. ఎన్‌ఐఏ విచారణ కోరిన జగన్ (CM JAGAN).. ఇప్పుడు సొంత పార్టీ కిడ్నాప్ వ్యవహారంపై ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? వేల కోట్ల విలువైన భూములు ఎంపీ చేతిలో ఉన్నాయన్న అక్కసుతోనే వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలు అతని కుటుంబాన్ని కిడ్నాప్ చేశాయి. వైసీపీ అంతర్గత పోరు, వాటాల పంపిణీలో తలెత్తిన వివాదాల్లో భాగంగా జరిగిన కిడ్నాప్ కాబట్టే జగన్ నోరెత్తలేదు.’’ అని తెలిపారు.

‘‘చంద్రబాబు గతంలో తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతోనే వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండ బట్టే.. రాష్ట్రంలో కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. కొడాలి నాని (Kodali Nani) ఒక నీచ్ కమీన్ గాడు. వాడి బతుక్కి వాడిపై చంద్రబాబు (Chandrababu) పోటీ చేయాలా? ప్రిజనరీ కింద పని చేస్తున్న పిచ్చికుక్కకు విజనరీ విలువ తెలుస్తుందా? వచ్చేఎన్నికల్లో నానీని ఓడించడానికి టీడీపీ కార్యకర్తలు చాలు. హరిహరాదులు వచ్చినా నానీ ఓటమిని ఆపలేరు. తనకు రాజకీయభిక్ష పెట్టిన చంద్రబాబుని నాని అనే ప్రతిమాట గుడివాడ ప్రజల గుండెల్ని తాకుతోంది. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లను మీ బాబు సొమ్ముతో కట్టించినట్టు సిగ్గు లేకుండా ఎలా ప్రారంభిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు కట్టించిన ఇళ్లు ప్రారంభించారు? టిడ్కో ఇళ్లపై ఉన్న రుణాల్ని చెల్లించకుండా.. లబ్దిదారులకు ఇళ్లు ఇస్తే రేపు బ్యాంకులు వారికి నోటీసులిస్తే జగన్ సమాధానం చెబుతారా?.’’ అని బోండా ఉమ నిలదీశారు.

Updated Date - 2023-06-16T15:29:57+05:30 IST