ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: జీవో నెం-1పై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

ABN, First Publish Date - 2023-05-13T13:32:45+05:30

జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు (AP HithCourt) ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి (CM YS Jganamohan Reddy) చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సిగ్గు ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నారు. సిగ్గులేకుండా మంత్రులు సుప్రీంకోర్టుకు వెళతామని అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ ఇవ్వకపోతే పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఏపీ పరువుపోయిందన్నారు. నాలుగేళ్లు ఏమీ చేయకుండా ఇప్పుడు కొత్తగా చేసిన వాటికే మళ్లీ శంఖుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. జీఎంఆర్ పనికిరారని.. చంద్రబాబు బినామీ అన్నారని.. కానీ నేడు ఆయనకే పనులు అప్పగించారన్నారు. జీ ప్లస్ గృహాలు ఇన్నాళ్లూ గుర్తుకురాలేదని... ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఇస్తామంటున్నారని అన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే బందరు పోర్టుకు మళ్లీ శంఖుస్థాపన జరిగిందన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని డబ్బులు దండుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుచుకుంటామని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-13T13:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising