ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుడివాడలో దేవాలయ భూముల కబ్బాకు వైసీపీ నేత కుట్ర.. టీడీపీ నేతల రాకతో..

ABN, First Publish Date - 2023-07-10T16:19:08+05:30

గుడివాడలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఐదు కోట్ల దేవస్థాన భూముల కబ్జాకు వైసీపీ యువ నేత పావులు కదుపుతున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి గుడివాడ నడిబొడ్డున కోట్లాది విలువైన స్థలాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వెయ్యి గజాల స్థలంలో రాత్రికి రాత్రే సాయిబాబా విగ్రహం వెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: గుడివాడలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఐదు కోట్ల దేవస్థాన భూముల కబ్జాకు వైసీపీ యువ నేత పావులు కదుపుతున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి గుడివాడ నడిబొడ్డున కోట్లాది విలువైన స్థలాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వెయ్యి గజాల స్థలంలో రాత్రికి రాత్రే సాయిబాబా విగ్రహం వెలిసింది. వైసీపీ యువనేత అనుచరులు రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తొలగించేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రయత్నించగా.. భక్తుల ముసుగులో వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు సంఘటనాస్థలికి చేరుకున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం కబ్జా చేస్తున్నారని దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త తుమ్మలపల్లి పరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.


మాజీ ఎమ్మెల్యే రావి కామెంట్స్..

24 గంటల్లో స్థలం ఖాళీ చేయించాలంటూ అధికారులకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అల్టిమేటం విధించారు. గుడివాడలో ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాలకు నిలయంగా గుడివాడ మారిందని తెలిపారు. కోట్లాది విలువైన దేవస్థాన భూమిని కాపాడుకుంటామన్నారు. అధికారులు స్పందించకుంటే ప్రభుత్వ భూమి పరిరక్షణకు తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు.

Updated Date - 2023-07-10T16:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising