ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రి రోజా ఎమ్మెల్యే ఆర్థర్‌కు క్షమాపణలు చెప్పాలి: దళిత సంఘాల నేతలు

ABN, First Publish Date - 2023-07-21T17:26:02+05:30

నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆర్కే రోజాపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల జిల్లా: నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆర్కే రోజాపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌కు క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నందికొట్కూరులోని ఎన్జీవో భవనంలో శాప్ చైర్మన్, సిద్ధార్థ రెడ్డి, మంత్రి రోజాకు వ్యతిరేకంగా దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.


ఎస్సీ రిజర్వుడు స్థానాలలో ఉన్న అగ్రవర్ణాల పెత్తనాన్ని తొలగించి, రిజర్వుడు వ్యక్తుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. మొన్న సిద్ధార్థ రెడ్డి వర్గీయులు అంబేద్కర్ సర్కిల్లో దళితుల ద్రోహి ఆర్థర్ అన్నదానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వర్గీయులు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కి వ్యతిరేకం కానీ ఏ కులానికి వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే వర్గీయులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-21T17:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising