Purandeswari: వైసీపీ సర్కారుపై పురందేశ్వరి పరోక్ష విమర్శలు
ABN, First Publish Date - 2023-09-13T19:40:05+05:30
కేంద్ర పథకాలను... రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసే వైనాన్ని తిప్పికొట్టాలి.
అమరావతి: వైసీపీ సర్కారుపై (YCP government) ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
"బీజేపీ విధానాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రసార మాధ్యమాలు మంచి వేదికలు. చర్చా వేదికల్లో మంచి భాషను వినియోగిస్తునే ప్రత్యర్థి పార్టీల వాదనలు తిప్పి కొట్టాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు ఈ రాష్ట్రంలో ఎలా పేర్లు మార్చేస్తున్నారు. కొన్ని పార్టీలు బీజేపీపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలియ చేయాలి. జీ20 వల్ల మనదేశ కీర్తి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎన్ని జాతీయ విద్యాసంస్థలు వచ్చాయి. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ వల్లే జరిగిందన్న విషయాలు ప్రసార మాధ్యమాలు ద్వారా చెప్పాలి. కేంద్ర పథకాలను... రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసే వైనాన్ని తిప్పికొట్టాలి" అని బీజేపీ నేతలకు పురందేశ్వరి సూచించారు.
బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోభవిష్యత్తు కార్యాచరణపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు.
Updated Date - 2023-09-13T19:42:27+05:30 IST