ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: కిషన్‌రెడ్డి తడబాటు.. మంత్రి రోజాను..

ABN, First Publish Date - 2023-02-14T21:30:37+05:30

అమరావతిలో ధ్యాన బుద్ధ వనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) , ఏపీ మంత్రి రోజా (Roja) ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: అమరావతిలో ధ్యాన బుద్ధ వనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) , ఏపీ మంత్రి రోజా (Roja) ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రోజాను తెలంగాణ మంత్రిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంబోదించారు. ఈ ఘటనతో మంత్రి రోజాతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు అవాక్కైయ్యారు. మీడియా ప్రతినిధుల సూచనతో కిషన్ రెడ్డి సవరించుకున్నారు. ప్రస్తుతం కిషన్ రెడి చేసిన ప్రసంగం అటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకు ముందు విజయవాడలో 33వ పుస్తక మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా దళిత సంఘాల నేతలు అక్కడకు‌ చేరుకున్నారు. మంత్రిని కలిసేందుకు అనుమతి ‌ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమువీర్రాజు, లక్ష్మీపతి రాజులు దళితుల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. బీజీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అరవై కోట్లు‌ విలువ చేసే 6 ఎకరాల భూమిని సోము‌ వీర్రాజు ‌కబ్జా చేశారని ఆరోపించారు. వల్లభనేని సుధాకర్, లక్ష్మీపతి రాజాల పేరుతో అగ్రిమెంట్ రాసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలు‌‌ కిషన్ రెడ్డికి చెప్పేందుకు ఇక్కడకి‌ వచ్చామని తెలిపారు. మమ్మలని కలవకుండా అడ్డుకుంటున్నారని, కబ్జా చేసిన స్థలం వద్ద రేపు ఆందోళన చేపడతామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు.

Updated Date - 2023-02-14T21:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising