ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ABN , First Publish Date - 2023-01-20T01:17:22+05:30 IST
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. బందరు డిపోను గురువారం ఆయన సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
మచిలీపట్నం టౌన్, జనవరి 19 : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. బందరు డిపోను గురువారం ఆయన సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మచిలీపట్నం డిపోలో రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను డిపో మేనేజర్ పెద్దిరాజులు ఆయనకు వివరించారు. డిపో విస్తరణ, ప్లాట్ ఫాం విస్తరణ పను లు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలు గుర్తించి వాటిని పరిరక్షిస్తూ దీర్ఘకాలిక లీజుకు ఇస్తున్నామన్నారు. గత 45 రోజులుగా 332 మంది కారుణ్య నియామకాలు చేశామన్నారు. ఆర్టీసీ ఈడీ కె.బ్రహ్మానందరెడ్డి, జిల్లా ప్రజారవాణాఽ అధికారి గద్దె నాగేశ్వరరావు, ఈఈ రాజశేఖర్, డీఈ జగదీష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్పారావు, డాక్టర్ విజయసింగ్, జిల్లా రవాణా శాఖాధికారి సీతాపతిరావు, డిపో మేనేజర్ పెద్దిరాజు పాల్గొన్నారు.
అవనిగడ్డ డిపో తనిఖీ
అవనిగడ్డ టౌన్ : అవనిగడ్డ డిపోను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం తనిఖీ చేశారు. డి గ్యారేజ్‌ను పరిశీలించిన కార్మికులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. డిపో ఆవరణలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. డిపో ఆదా యం పెంచే విషయంలో అవనిగడ్డ డీఎం హనుమంతరావు చేస్తున్న కృషిని అభినందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వరరావు, గద్దె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకులు వినతి,
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి
అవనిగడ్డలోని ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోరుతూ టీడీపీ నాయకులు ఆర్టీసీ ఎండీ దారకా తిరుమలరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అవనిగడ్డ బస్టాండ్‌లోని రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిందిగా కోరారు. అవనిగడ్డ నుంచి చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నంలకు బస్సు సౌకర్యం కల్పించాలని, నాగాయలంక నుంచి చీరాలకు బస్సును పునరుద్ధరించటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబా బు, బండే రాఘవ, భావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, ఘంటసాల రాజమోహనరావు, యలవర్తి చిన్నా, బర్మా శ్రీను, గుడివాక నరహరి, ఆవుల వెంకట కృష్ణారావు, పేటేటి శ్రీను, రేపల్లె అంకినీడు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మండలి వెంకటేశ్వరరావు వినతిపత్రాన్ని అందజేశారు.