Rammohannaidu: జగన్ ఆస్తులతో.. నెలకో వసతి దీవెన ఇవ్వొచ్చు..
ABN, First Publish Date - 2023-04-20T14:46:23+05:30
శ్రీకాకుళం: పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఏమ్మేల్యే గుండ లక్ష్మీదేవి, స్థానిక నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం: పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohannaidu), మాజీ ఏమ్మేల్యే గుండ లక్ష్మీదేవి (Gunda Lakshmi Devi), స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన సంస్కరణలను దేశంలోని కీలక నేతలు ఆచరించారని, మోడల్‌గా తీసుకున్నారని.. ప్రధానిగా వాజ్‌పాయ్ సయితం.. చంద్రబాబు సలహాలు తీసుకునేవారని అన్నారు. దివాళా తీస్తున్న రాష్ట్రాన్ని చంద్రబాబే బాగు చేయగలరని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భావనపాడు పోర్ట్ అనుమతులు తీసుకోస్తే నాలుగేళ్లు ఏం చేసారని సీఎం జగన్‌ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. పోర్టు శంఖుస్థాపన ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. పోర్టు పేరు, ఊరు మార్చారని.. అసలేం చేస్తున్నారో అర్దం కావడంలేదన్నారు.
శ్రీకాకుళం జిల్లాపై చిత్తశుద్ది ఉంటే .. శ్రీకాకుళం-ఆముదాలవలస (శ్రీకాకుళం రైల్వేస్టేషన్) రోడ్డు పరిస్థితి ఏంటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. మేం డబ్బులు శాంక్షన్ చేస్తే.. నాలుగేళ్లు అయినా ప్రభుత్వం రోడ్డు వేయలేకపోయిందని... 10 కిలో మీటర్ల రోడ్డే వేయలేకపోయారని.. ఇక పోర్టు నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. జగన్ హామీలు పేపర్లో రాసుకోవడానికి తప్ప.. ఒక్క రూపాయి రావడంలేదన్నారు. బోగాపురం ఏయిర్‌పోర్టు మరో కొత్త డ్రామాగా ఆయన అభివర్ణించారు. విశాఖ రాజధానిని ప్రజలు నమ్మడంలేదని.. అందుకే ఏయిర్‌పోర్టు తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. దేశంలో ధనికమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని.. ఆస్తులు లేవని పేదవారి దగ్గరికి వెళ్లి కాపాడాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఆస్తులతో.. నెలకో వసతి దీవెన ఇవ్వొచ్చన్నారు. కోడి కత్తితో ఆస్కర్ లేవేల్ డ్రామా చేశారన్నారు. ఒంటరి వాడినని జగన్ అంటున్నారని, తల్లిని దూరం చేసుకుని.. చెల్లిని తరిమేశారని విమర్శించారు. చెల్లి సునీతను సయితం దూరం చేసుకున్నారన్నారు.
ఇప్పుడు సీఎం జగన్ సంచి, స్టిక్కర్ రాజకీయం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్లని జగన్.. అవినాశ్ కోసం... డిల్లీకి పరిగెడుతున్నారని దుయ్యబట్టారు. విశాఖలో జగన్ కాపురం అంటే .. కబ్జా.. ఎక్కడ నచ్చితే అక్కడ కబ్జాకోసమే విశాఖ వస్తానంటారని.. విశాఖలో ఏం లేకుండా చేయడానికే వస్తానంటున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ముగిసిన అంశమని.. ప్రజలు కూడా మరిచిపోయారన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-20T14:46:23+05:30 IST