Rammohan Naidu: జగన్ క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు..
ABN , First Publish Date - 2023-09-17T12:21:08+05:30 IST
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదని, కేసు నిలబడదని అందరికీ తెలుసునని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదని..
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో అవినీతి జరగలేదని, కేసు నిలబడదని అందరికీ తెలుసునని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP Rammohan Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ (Governor)కు చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అంశాన్ని కూడా చెప్పలేదని, అధికారులు రాజకీయ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారని, సీఎం జగన్ (CM Jagan) క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. అరెస్ట్‌తో చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం ఇంకా పెరిగిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడ ఒక్క రుపాయి కూడా చంద్రబాబు కుటుంబానికి చేరలేదని, చంద్రబాబు జైల్లో ఉన్న చక్రం తిప్పుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా.. మేమ లోకేష్ నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ విధంగా ఆందోళన చేపట్టమో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు. న్యాయం, ప్రజా పోరాటం చేస్తామని, ఏ రకమైనటువంటి అవకాశం ఉన్న అన్ని వేదికల మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్‌లో పెద్ద ఎతున్న ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని, లండన్, అమెరికాలో కూడా ఆందోళనలు చేయడం చూశామని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏవైనా సరే ఒక గొప్ప నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. జగన్ చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోయారని, చంద్రబాబు నాయుడుపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనలో పలువురు న్యాయవాదులతో చర్చలు జరిపారని, దేశ ప్రజలకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశాన్ని తెలియజేసే విధంగా లోకేష్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారని రామ్మోహన్ నాయుడు తెలిపారు.