కిడ్నీ పరిశోధనా కేంద్రం, డయాలసిస్ కేంద్రాలపై మంత్రి చర్చకు రావాలి
ABN , First Publish Date - 2023-10-31T00:04:35+05:30 IST
పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం, సీహెచ్‌సీల్లో డయాలసిస్ కేంద్రాలు టీడీపీ హయాంలోనే మంజూరయ్యాయని, దీనిపై చర్చకు మంత్రి అప్పలరాజు రావాలని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీలపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
పలాస: పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం, సీహెచ్‌సీల్లో డయాలసిస్ కేంద్రాలు టీడీపీ హయాంలోనే మంజూరయ్యాయని, దీనిపై చర్చకు మంత్రి అప్పలరాజు రావాలని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీలపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్టీలు బెంచీలు తప్ప ఎంపీ చేసిన అభివృద్ధి ఏమిటని మంత్రి ప్రశ్నించడం హాస్యాస్పదం గా ఉందన్నారు. ఎంపీ గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదని, ప్రశ్నిం చే నేతలపై కేసులు పెట్టడం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదీ లేదని ఎద్దేవా చేశారు. తమ నేత గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో పలాస నియోజకవర్గంలో ప్రతి ఏటా వంశధార నీరు తీసుకువచ్చి రైతు లకు అందించారని, ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ హయాంలో ఒక్కసారైనా వంశధార నీరు వచ్చిందా అని వారు ప్రశ్నించారు. కింజరాపు, గౌతు కుటుంబాల కోసం మంత్రి మరోమారు మాట్లాడితే తగు రీతిలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎంపీని నటుడని, ముస్తాబైన సభలకు వస్తారని మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండి స్తున్నామన్నారు. మంత్రి కన్నా పెద్ద నటుడు ఎవరు ఉంటారని ఉదహరించారు. సమా వేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, సీనియర్ కౌన్సిలర్ గురిటి సూర్యనా రాయణ, నేతలు అంబటి కృష్ణమూర్తి, మల్లా శ్రీనివాస్, ఎంపిటీసీ సభ్యుడు చిట్టిబాబు పాల్గొన్నారు.