Bonda Uma: ఎక్కడికి రమన్నా వస్తా... వైసీపీ నేతలకు బోండా ఉమా సవాల్
ABN, First Publish Date - 2023-05-29T15:13:04+05:30
మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటన పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ: మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) మేనిఫెస్టో ప్రకటన పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ (TDP Leader Bonda Uma) నివాసంలో చంద్రబాబు చిత్రపటానికి బోండా ఉమ, తెలుగు మహిళలు పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బోండా ఉమా... వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పేదలు జగన్ పాలనలో రోడ్డుపైకి వచ్చారన్నారు. రాజమండ్రిలో ఎన్నికల మహానాడులో పేదవర్గాలపై అధ్యయనం చేసి అమ్మకు వందనం చేశారని తెలిపారు. మహిళా నిధి ద్వారా రాష్ట్రంలో ప్రతి మహిళలకు నెలకు రూ.1500, సంవత్సరానికి ఉచితంగా 3 సిలెండర్‌లు ప్రకటించారన్నారు. అన్నదాత ద్వారా ఏడాదికి 20 వేలు, నిరుద్యోగులకు నెలకు 3 వేలు యువగళం కింద అందించాలని నిర్ణయించారని తెలిపారు. అయితే ఇంతలోనే అంబటి రాంబాబు, కొడాలి నాని బయటకు వచ్చారని మండిపడ్డారు.
‘‘మీరు మీ మెదడు మోకాళ్ళలోకి వచ్చిందేమో చూడండి. చంద్రబాబు చేసిన సంక్షేమం, జగన్ చేసిన మోసకారి సంక్షేమంపై చర్చకు సిద్ధం. ఆయన భార్య, జగన్ చెప్పిన వీడియో రికార్డులు ఉన్నాయి. అమ్మవడి విషయంలో చెప్పింది ఒక్కటి చేసింది ఒక్కటి. అమ్మవడిపి రూ.16 వేలు నుండి రూ.13 వేలు చేశావు. ఇప్పటికీ మీరు ఇచ్చింది 3 అమ్మవడి లే ఇచ్చావు 2 ఇంకా ఇవ్వలేదు. పింఛను రూ.3వేలు అన్నావు ఇప్పటికీ చేయలేదు. చంద్రబాబు రూ.200 పింఛన్‌ను రూ.2వేలకు పెంచారు. నువ్వు వచ్చాక సంవత్సరానికి రూ.250 చప్పున పెంచావు. నువ్వు వచ్చాక ట్రూ ఆప్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో 57వేల కోట్లు కరెంట్ చార్జీలు పెంచావు. బస్ చార్జి లు అనేక మార్లు పెంచావు. ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి నీ ఢిల్లీ పర్యటనకు. నీ తమ్ముడిను వదలాలని నీ పేరు రావద్దని అమిత్ షా కాళ్ళు పట్టుకున్నావు. నిన్న 2 గంటల పాటు నువ్వు ఎటు వెళ్లి పోయావు, ఏమైపోయావు చెప్పాలి. మద్యపాన నిషేధం చేయలేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోండా ఉమా ఇంకా మాట్లాడుతూ...‘‘కొడాలి నాని నీకు బుద్ది జ్ఞానం లేదా. ఇవన్నీ మీరు చెప్పిన అబద్ధాలు కావా. ఒక్క కాల్ చేయి నేను వస్తా గుడివాడ, విజయవాడ ఎక్కడికి రమ్మంటావు రావడానికి నేను సిద్ధం. ఈ రోజు రైతులకు ఎంఎస్‌పి కూడా దక్కడం లేదని రైతులు పోరాటం చేస్తున్నారు. భారతదేశంలో సంక్షేమంలో టీడీపీ ముందుంది. నువ్వు ఇచ్చిన హామీల రికార్డ్ ఉంది. ఉద్యోగుల సీపీఎస్ వారంలో రద్దు చేయలేదు. వైసీపీ నాయకులు ప్రజల ముందుకు వస్తే చెప్పుతో కొడతారు అని వాళ్లకు తెలుసు. టీడీపీ మహానాడులో ఇచ్చిన తొలి మానిఫెస్టోపై ప్రజలు పండగ చేసుకుంటున్నారు. మీ బ్లూ మీడియాలో అయినా చర్చకు సిద్ధం’’ అంటూ టీడీపీ నేత సవాల్ విసిరారు.
పోసాని వ్యాఖ్యలపై ఫైర్...
ఎన్టీఆర్‌పై ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పోసానిని ఇంట్లో వాళ్లే రోడ్డుపైకి వదిలేశారు. అలాంటి వాడు కూడా ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఎలా. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు, న్యూ యార్క్ టైం స్క్వేర్‌లో ఆయన చిత్రాన్ని ప్రదర్శించారు’’ అని బోండా ఉమా పేర్కొన్నారు.
Updated Date - 2023-05-29T15:13:04+05:30 IST