Bonda Uma: చిరంజీవిని విమర్శించడానికి పేర్ని నాని ఎవడు గొట్టంగాడు
ABN , First Publish Date - 2023-08-09T11:57:51+05:30 IST
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు.
అమరావతి: మెగాస్టార్ చిరంజీవిపై(Megastar Chiranjeevi) వైసీపీ నేతల (YCP Leaders) విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ (TDP Leader Bonda Uma) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవిని వైసీపీ విమర్శించడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఇప్పుడు చిరంజీవిని విమర్శిస్తున్నారని.. గతంలో రజనీకాంత్‌ను (Rajinikanth).. కేసీఆర్‌ను (Telangana CM KCR) కూడా విమర్శించారని తెలిపారు. చిరంజీవి మాటల్లో ఏం తప్పుందని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ జోలికెందుకు వస్తారని.. ప్రత్యేక హోదా ప్రజలకు చేసే మంచి పనులు చేయండంటూ చిరంజీవి చెప్పారన్నారు. ఓ చిన్న సలహా ఇస్తే ఛోటా మోటా పకోడీగాళ్లు కూడా చిరంజీవిని విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. చిరంజీవి చెప్పింది నూటికి నూరు శాతం నిజమన్నారు. చిరంజీవిని విమర్శించడానికి పేర్ని నాని ఎవడు గొట్టంగాడు అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నారు. పాత విషయాలు ప్రస్తావించాల్సివ అవసరం ఏమొచ్చిందన్నారు. అందరూ గౌరవించే చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అంటేనే వివాదరహితుడని బోండా ఉమ పేర్కొన్నారు.