ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: మదర్స్ డే రోజు తల్లికి విషెస్ చెప్పని వాడు.. మీ బిడ్డనని అంటున్నాడు.. జగన్‌పై బోండా ఉమా ఫైర్

ABN, First Publish Date - 2023-05-16T14:54:59+05:30

తన పతనం కళ్ల ముందే జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తన పతనం కళ్ల ముందే జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) కనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (TDP Leader Bonda Umamaheshwar Rao) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిని ఆయన సీఎం జగన్‌పై (CM Jagan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మదర్స్ డే (Mothers Day) రోజు జన్మనిచ్చిన తల్లికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపని వాడు, ప్రజలకు మీ బిడ్డనని చెప్పుకుంటున్నారన్నారు. పాదయాత్రలో తల్లికి ప్రేమతో షూ లేస్ కట్టిన వ్యక్తిత్వం లోకేష్ దైతే, కన్న తల్లికి ఉన్న పదవులు పీకేసి రాష్ట్రం నుంచి తరిమేసిన బుద్ధి జగన్మోహన్ రెడ్డి ది అని అన్నారు. ఎన్నికలకు సింగిల్‌గా వెళ్తాడో లేక ఎంపీ గోరంట్ల మాధవ్‌లా గుడ్డలు విప్పుకుని వెళ్తాడో అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం అంటూ ఆయన యెద్దేవా చేశారు.

తెలుగుదేశం - జనసేనలు ఎలా ఎన్నికలకు వెళ్ళాలో చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. టీడీపీ - జనసేన కలిసి వెళ్తే వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ఆయన ముఖంలో కల లేదేంటని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎత్తులు, జిత్తులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇతరుల గురించి ఆ మాటలే రావడం విడ్డూరంగా ఉందన్నారు. 100 రోజుల యువగళం పాదయాత్రకు సంఘీభావంగా నిన్న 10 లక్షల మంది రోడెక్కారన్నారు. లోకేష్ పాదయాత్రలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారి, తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-16T14:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising