Bonda Uma: ఎర్రిపప్ప కారుమూరి నోరు అదుపులో పెట్టుకో..
ABN , First Publish Date - 2023-05-13T11:58:06+05:30 IST
రైతులు రాష్ట్రంలో బతకలేకపోతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ: రైతులు రాష్ట్రంలో బతకలేకపోతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (TDP Leader Bonda Umamaheshwar Rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల్లో ఏపీ అగ్ర స్థానంలో నిలిచిందని వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM Jaganmohan reddy)అధికారంలోకి వచ్చాక రైతుల గొంతు కోసారని మండిపడ్డారు. వ్యవసాయానికి ఇన్సూరెన్స్ లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సీఎం తాడేపల్లి దాటి అడుగు ముందుకు వేయడం లేదని.. వ్యవసాయ శాఖా మంత్రి అయితే పత్తా లేకుండా పోయారని విమర్శలు గుప్పించారు. అధికారులు పంట నష్టంపై అంచనాలు కూడా వేయడం లేదన్నారు. మంత్రి కారుమురి సొంత నియోజకవర్గంలో రైతులకు న్యాయం చేయాలని అడిగితే బూతులు తిట్టారన్నారు. ఎర్రిపప్ప కారుమూరి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అధికారుల హడావుడి తప్ప రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. న్యాయం చేయాలని అడిగితే రైతులపై కేసులు పెడతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. కావలి డీఎస్పీ వ్యవహరించిన తీరుపై డీజీపీ, హెచ్ఆర్సీకి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ముందస్తు ఎన్నికలు అయినా వెనుక ఎన్నికలైన వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. వై నాట్ 175 అంటూనే పొత్తులు అనగానే ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. ‘‘మేము పొత్తుతో వస్తె మీకు ఎందుకు సింగిల్ వస్తే మీకు ఎందుకు. పొత్తులు టీడీపీకి కొత్త కాదు పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకు ఎందుకు. మీరు సింగిల్ వస్తారో లేక గోరంట్ల మాధవ్‌లాగా, ఆదిములపు సురేష్‌లా బట్టలు విప్పుకుని వెళ్తారో వెళ్ళండి. పవన్ కల్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వగానే జగన్ పెంపుడు కుక్కలు ఎందుకు మోరుగుతున్నాయి. మీ పాలన వైఫల్యాలపై ప్రశ్నించే ఇతర పార్టీల పొత్తుల గురించి నైతిక అర్హత వైసీపీకి లేదని బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.