ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: మనువడు దేవాన్ష్‌పై చంద్రబాబు కుటుంబానికి ఎంతటి ప్రేమ ఉందో తెలియడానికి ఈ ఒక్కటి చాలు..

ABN, First Publish Date - 2023-03-21T18:39:01+05:30

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మనవడు దేవాన్ష్‌ (Devansh) పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమానికి విరాళమిచ్చారు.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మనవడు దేవాన్ష్‌ (Devansh) పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమానికి విరాళమిచ్చారు. తిరుమల (Tirumala)లోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు రోజూ రూ.33 లక్షల ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రూ. 33 లక్షల డీడీని టీటీడీ అధికారులకు ఇచ్చారు. వెంగమాంబ నిత్యాన్నప్రసాద క్షేత్రంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని దేవాన్ష్ పేరిట భక్తులకు వితరణ చేయనున్నారు. ‘టుడేస్‌ ఫుల్‌డే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌’ పేరిట తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్ ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు (Devotees) మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో ‘టుడేస్‌ ఫుల్‌డే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌’ పేరిట అన్నప్రసాదాలను వితరణ చేయనున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు తిరుమలలో శ్రీవారి దర్శించుకుని ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇస్తున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్న ప్రసాద వితరణకు విరాళాలు ఇస్తుంటారు. కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాన్ని ఇచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకోవడం ఆనవాయి. చంద్రబాబు కుటుంబం గతంలో స్వయంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంది. కానీ ఈ సారి కుటుంబసభ్యులెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రస్తుతం చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అందువల్ల ఈ సారి కుటుంబసభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనలేదని చెబుతున్నారు. అందుకే రూ. 33 లక్షల విలవగల డీడీని భువనేశ్వరి టీటీడీ (TTD) అధికారులకు పంపారు. గతేడాది కూడా అన్నప్రసాదాల వితరణకోసం టీటీడీకి రూ.30 లక్షలు పంపారు. మరోవైపు దేవాన్ష్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. దేవాన్ష్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ టీడీపీ శ్రేణులు తమ తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-03-21T18:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising