ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawankalyan: నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటా...

ABN, First Publish Date - 2023-08-17T15:10:02+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను గురువారం దసపల్లా హోటల్లో దివ్యాంగులు కలిశారు.

విశాఖపట్నం: నగరంలోని దసపల్లా హోటల్‌లో జనసేన జనవాణీ కార్యాక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జనసన అధినేత పవన్ కళ్యాన్‌ను (Janasena Chief Pawan Kalyan) దివ్యాంగులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయం చేస్తానని దివ్యాంగులకు జనసేనాని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా... సర్టివికెట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. అయితే సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వ నుంచి ఆర్ధిక సహాయం అందడం లేదన్నారు. సర్టిఫికెట్ లేని వారు అనేక మంది ఉంటున్నారని.. సర్టిఫికెట్ ఉన్నా కొందరికి న్యాయం జరగడం లేదన్నారు. దివ్యాంగులకు చట్టం ఉందని, అది అమలు కావడం లేదని తెలిపారు. దివ్యాంగులకు ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలన్నారు. ప్రభుత్వం కూడా 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని జనసేనాని మండిపడ్డారు.

సమాజంలో ఇలాంటి వారిని ఆదుకునే వారు ముందుకు రావాలని కోరారు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల దగ్గరికి వచ్చేలా చేస్తానని చెప్పారు. విదేశాల్లో దివ్యంగులను అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చూస్తాయన్నారు. ఆత్మ నూన్యత భావం ఉండకూడదనే అనుకుంటానని తెలిపారు. ఎన్డీఏ మీటింగ్‌కు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. అప్పు సోప్పో చేసైనా అదుకుంటానని మాటిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాలు చేసే పని లేకుండా చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు లోన్‌లు ఇచ్చి ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-17T15:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising