GantaSrinivasrao: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-06-29T12:42:07+05:30
జగన్ పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
విశాఖపట్నం: జగన్ పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇందుకు విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాపే పెద్ద ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అమ్మ ఒడిపై సీఎం జగన్ మాట తప్పారని.. మడమ తిప్పారని అన్నారు. సగం మందికి మాత్రమే అమ్మఒడి డబ్బులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నా వారికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు శాశ్వతంగా బై బై చెప్పే రోజులు వస్తాయన్నారు. టీడీపీ బస్సు యాత్రకు బ్రహ్మాండమైన స్పందన వస్తోందని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? చంద్రబాబుని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టో చూసి వైసీపీకి వెన్నులో వణుకుపుడుతోందని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Updated Date - 2023-06-29T12:42:07+05:30 IST