జీవనభృతి ప్యాకేజీ ఇవ్వాల్సిందే..
ABN, First Publish Date - 2023-02-19T00:36:26+05:30
నేవల్‌బేస్ ఏర్పాటుతో జీవనాధారాన్ని కోల్పోయా మని, మాకు జీవనభృతి ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని కొప్పగొండుపాలెం, కొత్తపేట, చినకలవలాపల్లి గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు.
రాంబిల్లి, ఫిబ్రవరి 18: నేవల్‌బేస్ ఏర్పాటుతో జీవనాధారాన్ని కోల్పోయా మని, మాకు జీవనభృతి ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని కొప్పగొండుపాలెం, కొత్తపేట, చినకలవలాపల్లి గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. వాడనర్సాపురం, కొప్పుగొండుపాలెం సమీపంలోని నేవీ గేట్ల ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నేవీ నిర్వాసిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. భూములు కోల్పోయి ఉపాధి లేక కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. తమకు జీవనభృతి ప్యాకేజీ ఇస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా ఎందుకు అమలు జరగడం లేదని వారు ప్రశ్నించారు. గత 111 రోజులుగా ఆందోళన చేస్తున్నా మా సమస్యల పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఆందోళనలో మూడు గ్రామాల నేవీ నిర్వాసితులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-19T00:36:28+05:30 IST