Vangalapudi Anita: జగన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి?..
ABN , First Publish Date - 2023-04-11T15:25:46+05:30 IST
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan)ని ప్రజలు ఎందుకు నమ్మాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) ప్రశ్నించారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan)ని ప్రజలు ఎందుకు నమ్మాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘నాలుగేళ్లలో 7సార్లు విద్యుత్ ఛార్జీలు (Electricity Charges) పెంచి రూ. 20 వేల కోట్ల భారం మోపినందుకు నమ్మాలా?.. మద్యపాననిషేదం అనిచెప్పి, మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకా?.. తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి ఇస్తున్నందుకా?.. మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసి, చంపినందుకా?.. తన అవినీతిని ప్రశ్నించిన దళితయువకుల్ని బలితీసుకున్నందుకా?.. మహిళల మానప్రాణాలతో ఆడుకుంటూ, వారి జీవితాలు నాశనంచేస్తున్నందుకా?.. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేక, జనంలోకి రావడానికి ముఖం చెల్లనందుకు జగన్‌ను నమ్మాలా?’’ అని ప్రశ్నించారు.
జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్ల (Stickers)ను ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు ఇళ్లగోడలపై అంటించడం చట్టవిరుద్ధంకాదా? అని అనిత ప్రశ్నించారు. ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ (AP Prevention Act) 1997 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజల అనుమతి లేకుండా వారిఇళ్లపై ప్రకటనలు. బొమ్మలు అంటించడం చేయకూడదని తెలియదా? అని నిలదీశారు. టీడీపీ మహిళానేత కల్యాణి అరెస్టులో హద్దులు మీరి ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women)కు ఫిర్యాదుచేస్తామన్నారు. మంత్రి రోజా (Minister Roja) ఇచ్చిన సవాల్‌ను తానుస్వీకరిస్తున్నానన్నారు. ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. పరదాలు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా జనంలోకి వచ్చే దమ్ము, ధైర్యం జగన్‌కు, రోజాకు ఉన్నాయా? అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.