AP Volunteers: వామ్మో... ఏపీలో వలంటీర్లు ఏంటి ఇలా ఉన్నారు?.. సచివాలయ ఉద్యోగులు కూడా...

ABN , First Publish Date - 2023-08-03T09:57:58+05:30 IST

ఏపీలో వలంటీర్లు చేస్తున్న మోసాలు, దారుణాలు ప్రతీరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలు జిల్లాలో వలంటీర్లు చేస్తున్న బాగోతాలు విన్నా, చూసినా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఓ వలంటీర్ వృద్ధురాలిని హత్య చేయగా, మరో వలంటీర్ యువతిని వేధింపులకు గురిచేశాడు. నిన్న ప్రకాశం జిల్లాలో మరో వలంటీర్ ఎక్కడో ఉండి.. తాను ఇక్కడే ఉన్నట్టు సృష్టించి బయోమెట్రిక్ ద్వారా పంపిచన్లను పంపిణీ చేశాడు.

AP Volunteers: వామ్మో... ఏపీలో వలంటీర్లు ఏంటి ఇలా ఉన్నారు?.. సచివాలయ ఉద్యోగులు కూడా...

అనకాపల్లి: ఏపీలో వలంటీర్లు చేస్తున్న మోసాలు, దారుణాలు ప్రతీరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలు జిల్లాలో వలంటీర్లు చేస్తున్న బాగోతాలు విన్నా, చూసినా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఓ వలంటీర్ వృద్ధురాలిని హత్య చేయగా, మరో వలంటీర్ యువతిని వేధింపులకు గురిచేశాడు. నిన్న ప్రకాశం జిల్లాలో మరో వలంటీర్ ఎక్కడో ఉండి.. తాను ఇక్కడే ఉన్నట్టు సృష్టించి బయోమెట్రిక్ ద్వారా పిచన్లను పంపిణీ చేశాడు. ఇవన్నీ ఒకఎత్తైతే.. ఇప్పుడు తాజాగా మనం చెప్పుకునే వలంటీర్ చేసిన నిర్వాకం చూస్తే మాత్రం ముక్కునవేలేసుకోకుండా ఉండలేరు. సచివాలయ ఉద్యోగులతో కలిసి వలంటీర్ మోసానికి పాల్పడ్డాడు.

అనకాపల్లి జిల్లాలో వలంటీర్ల ఆరాచకాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ నానాజీ అడ్డదారులను ఎంచుకున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిజిటల్ అసిస్టెంట్ సుధీర్ అవివాహితుడైనప్పటికీ.... పెళ్లి అయినట్టు నకిలీ ధ్రువపత్రం తయారుచేసుకున్నాడు. మరోవైపు పెళ్లి అయినా భర్తలతో విడిపోయినట్టు సచివాలయ మహిళా ఉద్యోగులు రాజేశ్వరి, వెంకటలక్ష్మి పత్రాలు సృష్టించుకున్నారు. వీరి బాగోతాలను గుర్తించిన పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదుతో సచివాలయ ఉద్యోగుల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, సహకరించిన వలంటీర్‌ను ఆచ్యుతాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.


ప్రకాశం జిల్లా వలంటీర్ బాగోతం చూడండి...

ప్రకాశం జిల్లా పామూరు మండలం కందులవారిపల్లిలో రాచగొర్ల గురుప్రసాద్‌ అనే వ్యక్తి వలంటీర్‌గా పని చేస్తున్నాడు. నిజానికి ఇతను ఉండేది బెంగుళూరు. ఇక్కడ పింఛన్ల పంపిణీ వంటి కార్యకలాపాలు మాత్రం యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. మరి వేలిముద్రలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటారా? అందుకే మనోడు మహా ముదురని చెప్పింది. ప్లాస్టిక్ వేలి ముద్రలను తయారు చేసి తన సోదరుడు గురుస్వామికి ఇచ్చాడు. ఇక ఆ ప్లాస్టిక్ వేలిముద్రల సాయంతో గురుస్వామి పింఛన్లు పంపిణీ చేస్తుంటాడన్న మాట. మరో విషయం ఏంటంటే.. ఈ తమ్ముడు సారూ.. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లడు. వారినే తమ ఇంటికి పిలిపించుకుని ప్లాస్టిక్‌ వేలిముద్రలతో బయోమెట్రిక్‌ వేసి లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తాడు. ఇలా తాజాగా కొందరు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయడంతో మిగిలిన లబ్దిదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలంటీర్ గురుప్రసాద్ బాగోతం వెలుగు చూసింది. అధికారులు విచారణ చేపట్టారు.

Updated Date - 2023-08-03T10:01:42+05:30 IST