Kothapalli Subbarayudu: చంద్రబాబు అరెస్టు ఉద్దేశ, కక్ష పూరితంగా జరిగింది

ABN , First Publish Date - 2023-09-15T16:06:11+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రంగా ఖండించారు.

Kothapalli Subbarayudu: చంద్రబాబు అరెస్టు ఉద్దేశ, కక్ష పూరితంగా జరిగింది

పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌‌ను (Chandrababu Arrest) మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Former Minister Kothapalli Subbarayudu) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టు ఉద్దేశ, కక్ష పూరితంగా జరిగిందన్నారు. అరెస్టు తీరు తెలుగు ప్రజలను కలిచివేసిందన్నారు. అరెస్టు ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదని విమర్శించారు. జైల్లో చంద్రబాబుకు భద్రత లేదన్నారు. జెడ్ కేడర్‌లో ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలపటం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటన టీడీపీ, జనసేన వర్గాలలో ఉత్సాహాన్ని నింపాయని కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-15T16:06:11+05:30 IST