Share News

AP News: నూతన జంట సినిమాకు వెళ్లి వస్తుండగా అనుకోని ఘటన...

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:13 AM

Andhrapradesh: జిల్లాలోని పెనుగొండ మండలం విషాదం చోటు చేసుకుంది. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి నూతన జంట గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

AP News: నూతన జంట సినిమాకు వెళ్లి వస్తుండగా అనుకోని ఘటన...

ప.గో: జిల్లాలోని పెనుగొండ మండలం విషాదం చోటు చేసుకుంది. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి నూతన జంట గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరికి ఈనెల 16న వివాహం జరిగింది. ఈనెల 19న నూతన జంట రావులపాలెంలో సినిమాకు వెళ్లి తిరిగి వస్తుండగ ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జిపై నుంచి దూకడంతో చుటుప్రకల వాళ్ళు కేకలు వేయగా మత్య్సకారులు చూసి వెంటనే పడవల సహాయంతో భర్తను వడ్డుకు తరలించారు. భార్య ఆచూకీ దొరకకపోవడంతో సంబధిత అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గోదావరిలో గాలించగా నవ వధువు మృతదేహం లభ్యమైంది. అమ్మాయి వడలి గ్రామం, అబ్బాయి మోర్త గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువులో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 21 , 2023 | 10:13 AM