TDP Leader: కోలమూరు గ్రామస్తుల సమస్యలు విన్న లోకేశ్

ABN , First Publish Date - 2023-09-04T12:40:36+05:30 IST

టీడీపీ యువనత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

TDP Leader: కోలమూరు గ్రామస్తుల సమస్యలు విన్న లోకేశ్

పశ్చిమగోదావరి: టీడీపీ యువనత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం 204వ రోజు పాదయాత్రను ఉండి మండలం కోలమూరు నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండి మండలం కోలమూరు గ్రామస్తులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని.. మురికి నీరు తాగడంతో అనారోగ్య సమస్య ఎదురువుతున్నాయని తెలిపారు. ఆక్వా రైతులందరికీ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. విద్యుత్ కోతల సమస్యతో రొయ్యలు డీఓ సమస్యతో చనిపోతున్నాయన్నారు. లో ఓల్టేజ్ ఉండటంతో ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయని గ్రామస్తులు వాపోయారు.


నారా లోకేష్ మాట్లాడుతూ... టీడీపీ రాగానే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ 24 గంటల పాటూ మంచినీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్‌కు.. నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన లేదన్నారు. తామొచ్చాక లో ఓల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ ను ప్రజలు, ఆక్వా రైతులకు అందిస్తామన్నారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని రాష్ట్రంలో జె.బ్రాండ్ల మద్యం నిషేధిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-09-04T12:40:36+05:30 IST