ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

161 గ్రామ/వార్డు వలంటీర్ల ఎంపికకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-02-09T23:35:15+05:30

జిల్లాలోని గ్రామ పంచాయతీ/మునిసిపాలిటీలలో ఖాళీగా ఉన్న 161 గ్రామ/వార్డు వలంటీర్లు ఎంపికకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టరు పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, ఫిబ్రవరి 9 : జిల్లాలోని గ్రామ పంచాయతీ/మునిసిపాలిటీలలో ఖాళీగా ఉన్న 161 గ్రామ/వార్డు వలంటీర్లు ఎంపికకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టరు పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 9 నుంచి 13 సాయంత్రం 5గంటల లోపుగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణుడై ఉండాలి. 9వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారై 35 ఏళ్ళ దాటనివారై ఉండాలి. గ్రామ/వార్డు వలంటీర్లు ఏ మునిసిపాలిటీ/గ్రామ పంచాయతీలలో పనిచేయాలని ఆశిస్తారో, ఆ మునిసిపాలిటీ/గ్రామ పంచాయతీకి చెందినవారై ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు మునిసిపాలిటీ/మండల స్థాయి కమిటీచే మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-09T23:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising