AP News: ఆకివీడులో ఘరానా మోసం
ABN , Publish Date - Dec 30 , 2023 | 09:19 AM
Andhrapradesh: జిల్లాలోని ఆకివీడులో ఘరానా మోసం జరిగింది. ఓ మహిళ షాపులలో బంగారు పూత వేసిన ఆభరణాలను మార్చి అసలైన బంగారు నగలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ గోదావరి,డిసెంబర్ 30: జిల్లాలోని ఆకివీడులో ఘరానా మోసం జరిగింది. ఓ మహిళ షాపులలో బంగారు పూత వేసిన ఆభరణాలను మార్చి అసలైన బంగారు నగలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భీమవరం, నర్సాపురం, పాలకొల్లులలో పలు బంగారు షాపులలో నగలు మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. నగలు కరిగించగా బంగారంలో రాగి ఎక్కువగా ఉందని గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లలో మహిళ ఫోటో, వీడియోలను వ్యాపారస్తులు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆకివీడులో బంగారపు షాపులో నగలు మారుస్తుండగా మహిళను షాపు యజమాని నిర్బంధించాడు. అయితే మహిళ మాత్రం మోసాన్ని అంగీకరించకపోగా.. తాను ఆన్లైన్ షాపింగ్ చేసినట్టు రుజువులు చూపిస్తోంది. సదరు మహిళ కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.