Cesareans :ఏమిటీ కోతలు?

ABN , First Publish Date - 2023-02-16T03:11:47+05:30 IST

దేశంలోనే అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే! గత ఏడాది రాష్ట్రంలో 42.7శాతం ప్రసవాలు సిజేరియన్‌ ద్వారానే జరిగాయి! జాతీయ సగటుతో పోల్చితే ఇది 17

 Cesareans :ఏమిటీ కోతలు?

రాష్ట్రంలో 42% ప్రసవాలు సిజేరియన్‌లే.. దేశంలోనే అత్యధికం

ధనార్జనే ధ్యేయం కాకూడదు.. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి

అధిక సిజేరియన్లు చేస్తే చర్యలు.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక

ప్రజా చైతన్యంలో ఆరోగ్యశాఖ విఫలమని వెల్లడి.. ఆత్మవిమర్శ చేసుకోవాలని వ్యాఖ్య

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే! గత ఏడాది రాష్ట్రంలో 42.7శాతం ప్రసవాలు సిజేరియన్‌ ద్వారానే జరిగాయి! జాతీయ సగటుతో పోల్చితే ఇది 17 శాతం అధికం! రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు స్వయంగా ఈ వివరాలు చెప్పారు. సహజ ప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రాణాంతకంగా మారుతున్న సిజేరియన్ల జోలికి పోవద్దని వైద్యులను కోరారు. బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గైనకాలజిస్టులు, ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. నూరు శాతం ప్రసవాలను సిజేరియన్‌ పద్ధతిలోనే చేసిన ఆసుపత్రులపై కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సిజేరియన్‌ ప్రసవాలు చేస్తే ఆరోగ్యశ్రీ గుర్తింపు రద్దు చేస్తామన్నారు. అధిక సిజేరియన్‌ ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల్ని ఆడిట్‌ చేయాలని ఈ భేటీలో వర్చువల్‌గా పాల్గొన్న డీఎంహెచ్‌వోలను ఆయన ఆదేశించారు. సిజేరియన్లు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం 10 నుంచి 15 శాతం మేర మాత్రమే జరగాలని స్పష్టం చేశారు. అనవసర సిజేరియన్లు ప్రాణాంతకమన్న విషయంపై ప్రజల్లో చైతన్యం కలగజేయటంలో అధికారులు కూడా విఫలమవుతున్నారన్న విషయాన్ని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు.

Updated Date - 2023-02-16T03:11:51+05:30 IST