YCP MLA: మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకున్న కొడాలి నాని

ABN , First Publish Date - 2023-09-04T13:52:55+05:30 IST

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకున్నారు. ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. 1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారన్నారు. పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమన్నారు.

YCP MLA: మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకున్న కొడాలి నాని

కృష్ణా: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali Nani)
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (TDP Chief Chandrababu Naidu) నోరుపారేసుకున్నారు. ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. 1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారన్నారు. పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమన్నారు. ఈ డబ్బు అంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందంటే కమీషన్లు తీసుకోబట్టే కదా అని అన్నారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తమన్నారు. ఇది రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే అని.. లక్ష కోట్లు వరకు దోచుకున్నారని ఆరోపించారు. హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.


పాలు, పెరుగు అమ్మే వాళ్లు చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారన్నారు. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికలలో వేల కోట్లు ఖర్చు పెట్టి అయినా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో స్వార్థపరుడు, అవినీతిపరుడు, నమ్మక ద్రోహి, 420 గాడు చంద్రబాబు మాత్రమే అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే.. 2014లోనే తాము అధికారంలోకి వచ్చే వాళ్ళమన్నారు. చంద్రబాబు క్లీన్ చిట్ అని కేసులు లేవంటారా అని ప్రశ్నించారు. రెండు ఎకరాల వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. ఈః చట్టాలు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్‌తో ఎలా కలిశారు, బీజేపీని బూతులు తిట్టారని.. ఇప్పుడు వాటేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ 2014లో ఓడిపోయారని ఎవరినైనా కలిశారా.. ఒంటరిగా పోటీ చేయలేదా అని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏమైనా పేద కుటుంబమా... కాదు కదా అని అన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ మేనేజ్ చేసి, బీజేపీ, మోడీ సంక నాకినా.. రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు తప్పించుకోలేరంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-04T14:09:37+05:30 IST