ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

2047 నాటికి భారత్‌ రూ.2,550 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2023-10-30T02:08:40+05:30

భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల (రూ.2,550 లక్షల కోట్లు) విలువ గల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు అవసరమైన విజన్‌ పత్రాన్ని...

డిసెంబరు నాటికి విజన్‌ ముసాయిదా సిద్ధం: నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల (రూ.2,550 లక్షల కోట్లు) విలువ గల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు అవసరమైన విజన్‌ పత్రాన్ని రూపొందించనున్నట్టు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవసరం అయ్యే సంస్థాగత, వ్యవస్థాత్మక మార్పులు లేదా సంస్కరణలను ఆ పత్రంలో ఆవిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ విజన్‌ ఇండియా- 2047 ముసాయిదా డిసెంబరు నాటికి సిద్ధమవుతుందని, దానిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు మూడు నెలల పాటు ప్రజల ముందుంచుతామని అన్నారు. తాము ప్రధానంగా పేదరికం, మఽధ్యాదాయ ముద్ర నుంచి బయటపడాలని కృషి చేస్తున్నామని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. అలాగే భారత్‌ అగ్రగామిగా ఉండగల రంగాలు, టెక్నాలజీలను కూడా ఈ పత్రం గుర్తిస్తుందని, భారత మార్కెట్‌ పరిమాణాన్ని సంపూర్ణంగా వినియోగించుకోగల చర్యలు సూచిస్తుందని సుబ్రహ్మణ్యం చెప్పారు. సమాంతరంగా రాష్ర్టాలు కూడా తమ విజన్‌ పత్రాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. విజన్‌ పత్రం విడుదల చేయడానికి ముందు నవంబరులో ఎస్‌జీఓఎ్‌సలు, అదానీ, అంబానీ, సుందర్‌ పిచాయ్‌ వంటి పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. 2021 డిసెంబరులోనే ఈ ప్రక్రియకు కేబినెట్‌ కార్యదర్శి శ్రీకారం చుట్టారని, ప్రధాని సూచన మేరకు ఆయా రంగాలకు సంబంధించిన విజన్‌ రూపొందించే బాధ్యతను 10 సెక్టోరల్‌ గ్రూప్‌ కార్యదర్శులకు అప్పగించారని వెల్లడించారు. ఈ విజన్‌ పత్రాలన్నింటినీ సమీకృతం చేసి 2047 నాటికి వికసిత్‌ భారత్‌ పేరిట విజన్‌ ముసాయిదా విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-10-30T02:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising