Nokia C12: నోకియా అభిమానులకు గుడ్‌న్యూస్.. నోకియా సి12 ఇక్కడ మాత్రం సగం ధరకే!
ABN , First Publish Date - 2023-03-13T19:29:09+05:30 IST
ఈ ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్‌లో విడుదలైన నోకియా సి12( Nokia C12)
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్‌లో విడుదలైన నోకియా సి12( Nokia C12) ఇప్పుడు భారత్‌కు వచ్చేసింది. నోకియా సి సిరీస్ పోర్ట్‌ఫోలియోలో లాంచ్ చేసిన ఈ ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. 6.3 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా సెన్సార్, ఆక్టాకోర్ యూనిసోక్ 9863A1 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ఉంది. అవసరమైతే ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 4జీబీ ర్యామ్‌ను ఉపయోగించుకునేలా ర్యామ్‌ను డిజైన్ చేశారు. నోకియా సి12లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 5వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
లభ్యత.. ధర వివరాలు
నోకియా సి12 2జీబీ-64జీబీ స్టోరేజీ ధర భారత్‌లో రూ. 5,999 మాత్రమే. ఇది పరిచయ ధర మాత్రమే. ఇది ఎంతకాలం ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. కార్కోల్, డార్క్ సియాన్, లైట్ మింట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్(Amazon)లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నెల 20 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్లలో నోకియా సి12ని 119 యూరోల (దాదాపు రూ. 10,500) ధరతో విడుదల చేసింది.
నోకియా సి12 స్పెసిఫికేషన్లు
నోకియా సి12 ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో పనిచేస్తుంది. రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ స్టైల్ కట్‌అవుట్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ 9863A 1 ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 4జీబీ వరకు పెంచుకునే అవకాశం, 8 ఎంపీ రియర్ కెమెరా, ఆటోఫోకస్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వంటివి ఉన్నాయి. నోకియా సి12లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 5వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.