Notes: స్టార్ గుర్తు ఉన్న నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇలాంటి నోటు వస్తే..
ABN, First Publish Date - 2023-07-28T04:05:42+05:30
నంబర్ ప్యానెల్‌లో స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లలాగే చట్టబద్ధమైనవేనని, చెల్లుబాటవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్‌బీఐ కరెన్సీని సీరియల్ నంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్‌ల్లో జారీ చేస్తుంది. ఆ ప్యాక్‌లో ముద్రణ లోపాలున్న నోటును భర్తీ చేసేందుకు తిరిగి ముద్రించే నోటు నంబర్ ప్యానెల్‌లో ప్రిఫిక్స్‌కు, సీరియల్ నంబర్‌కు మధ్యలో స్టార్ గుర్తును చేరుస్తామని తెలిపింది.
స్పష్టం చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
ముంబై: నంబర్ ప్యానెల్‌లో స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లలాగే చట్టబద్ధమైనవేనని, చెల్లుబాటవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్‌బీఐ కరెన్సీని సీరియల్ నంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్‌ల్లో జారీ చేస్తుంది. ఆ ప్యాక్‌లో ముద్రణ లోపాలున్న నోటును భర్తీ చేసేందుకు తిరిగి ముద్రించే నోటు నంబర్ ప్యానెల్‌లో ప్రిఫిక్స్‌కు, సీరియల్ నంబర్‌కు మధ్యలో స్టార్ గుర్తును చేరుస్తామని తెలిపింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల కు అవగాహన కల్పించేందుకు ఈ వివరణ ఇచ్చింది.
డిజిటల్ చెల్లింపుల్లో 13 శాతం వృద్ధి
ఈ మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్త డిజిటల్ చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 13.24 శాతం పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. దేశంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల స్థాయిని గణించేందుకు ఆర్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ ఇండెక్స్‌ను రూపొందించింది. మార్చి నాటికి ఈ సూచీ 395.57కు పెరిగింది. 2022 మార్చి నాటికి స్కోరు 349.30గా ఉంది.
Updated Date - 2023-07-28T10:54:29+05:30 IST