ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tours And Travels: ఈ ఏడాది ‘వర్క్‌కేషన్స్’ పర్యాటకం!

ABN, First Publish Date - 2023-01-20T19:29:12+05:30

కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పర్యాటకం మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ ఏడాది ట్రావెల్ రంగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పర్యాటకం మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ ఏడాది ట్రావెల్ రంగం పుంజుకోబోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గతేడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ట్రావెల్ ధోరణలు ఎలా ఉంటాయన్న దానిపై వండర్‌లా హాలీడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలాపిళ్లై మాట్లాడారు.

ఈ ఏడాది మహిళా పర్యాటకులు పెరుగుతారని, వర్క్‌కేషన్స్ ధోరణి వరకు ఎనో ఆవిష్కరణలు రాబోతున్నాయన్నారు. సాంస్కృతిక వర్క్‌షాప్‌లు, ఔట్‌డోర్ సాహసాలు, స్థానిక చెఫ్‌ల వద్దకు పర్యాటకులను తీసుకెళ్లడం, డెస్టినేసన్ క్యూజిన్‌లను నేర్చుకోవడం వంటి లీనమయ్యే టూర్లు కూడా ఉంటాయన్నారు.

అలాగే, ప్రొఫెషనల్ ట్రిప్స్ సమయంలో బిజినెస్, లీజర్‌ను మిక్స్ చేసే బ్లీజర్‌ ట్రావెల్ కూడా ఇందులో ఉంటుంది. గతేడాది ప్రారంభమైన ఈ ధోరణి ఈసారి కూడా కొనసాగుతుందని అంచనా. ఉద్యోగ రంగంలోకి ఎక్కువమంది మహిళలు రావడం, నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల వారు బిజినెస్ ట్రిప్స్‌ను నూతన ప్రాంతాల అన్వేషణకు ఉపయోగించుకుంటున్నారు. తమ కోసం తాము సమయాన్ని వెచ్చించుకుంటున్నారు. ఈ ధోరణి కారణంగా సోలో ఫిమేల్‌ ట్రావెలర్స్‌, మహిళలతో కూడిన ట్రావెల్‌ గ్రూప్స్‌ పెరిగే అవకాశాలున్నాయని అరుణ్ కె.చిట్టిలాపిళ్లై తెలిపారు.

పర్యాటకులు ఎక్కువగా ఒత్తిడి లేని టూర్లకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి పర్యటనకు ముందుగానే ట్రావెల్ బుకింగ్, వసతి వంటవి ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నారు. అలాగే, వారాంతాలు, జాతీయ సెలవు దినాలు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

వర్క్‌ను, వెకేషన్‌ను కలిపేసే ‘వర్క్‌కేషన్స్’ ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని వండర్‌లా హాలీడేస్ ఎండీ అంచనా వేశారు. ఈ ధోరణి ఎక్కువగా రిమోట్‌ వర్కర్స్‌, డిజిటల్‌ నోమాడ్స్‌ (సంచారులు) మధ్య ప్రాచుర్యం పొందే అవకాశాలున్నాయి. రిమోట్‌ వర్క్‌లోని స్వేచ్ఛ, సౌకర్యాన్ని వీరు ఉపయోగించుకుంటూనే నూతన ప్రాంతాలను అన్వేషించనున్నారు. నగర వాతావరణానికి దూరంగా విశ్రాంత వాతావరణాన్ని ఇష్టపడుతున్నవారు ఈ తరహా యాత్రలను ఇష్టపడొచ్చు.

Updated Date - 2023-01-20T19:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising