Hayath Nagar Murder Case : టీచర్ సుజాత-రాజేష్ ఎపిసోడ్లో అసలేం జరిగిందో చెప్పేసిన రాచకొండ సీపీ..
ABN , First Publish Date - 2023-06-01T15:40:03+05:30 IST
హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనం సృష్టించిన హయత్‌నగర్ టీచర్ సుజాత-రాజేష్ (Teacher Sujatha-Rajesh) ఎపిసోడ్లో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోది.
హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనం సృష్టించిన హయత్‌నగర్ టీచర్ సుజాత-రాజేష్ (Teacher Sujatha-Rajesh) ఎపిసోడ్లో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోది. ఇప్పటికే అటు సుజాత ఆత్మహత్య, రాజేష్ ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సుజాత-రాజేష్ ఎపిసోడ్లో అసలేం జరిగిందనే విషయాన్ని రాచకొండ పోలీసులు నిగ్గు తేల్చారు. రాజేష్ మృతికేసును మొదట అనుమానాస్పద మృతికేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధమేంటి..? రాజేష్ ఎలా మృతిచెందాడు..? అనే విషయాలను నిగ్గు తేల్చారు. గురువారం మధ్యాహ్నం రాచకొండ పోలీస్ కమిషనర్ సీపీ చౌహాన్ (Rachakonda CP DS Chauhan) మీడియాతో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..!?
‘ రాజేష్-టీచర్ సుజాత ఇద్దరూ పురుగుల మందు తాగి మృతిచెందారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా సంబంధం ఉంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించాము. మిస్డ్కాల్డ్తో (Missed Call) ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. రాజేష్ మృతదేహంపై గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రాజేష్ వ్యవహారం సుజాత కొడుకు జయచంద్రకు తెలిసింది. రాజేష్ ప్రతి రోజు సుజాత ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. సుజాతతో రాజేష్ బాగా చనువుగా ఉన్నాడు. రాజేష్ ఇలా ఉండటాన్ని సహించలేక సుజాత కొడుకు తన స్నేహితులతో కలిసి కొట్టాడు. సుజాత-రాజేష్ ఇద్దరూ కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించి.. కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకే రోజు ఇద్దరూ పురుగుల మందు తాగలేదు. మొదట సుజాత పురుగుల మందు తాగింది. తల్లి చావు బతుకుల మధ్య ఉందని రాజేష్‌కు చెప్పింది జయచంద్రే. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నాం’ అని చౌహాన్ మీడియాకు వివరించారు.
ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..!?
ఇప్పటికే.. రాజేష్-టీచర్ సుజాతల మధ్య పరిచయంపై పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 7 నెలల క్రితం సుజాత ఫోన్ నుంచి రాజేష్‌కు రాంగ్ డయల్‌గా (Wrong Dial) కాల్ వెళ్లింది. ఇలా రాంగ్ డయల్‌తో ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య తరుచూ వాట్సాప్ మెసేజ్‌లు నడిచాయని పోలీసులు తేల్చారు. సుజాత డీపీ చూసిన రాజేష్.. ఆమెకు పెళ్లి కాలేదనే నమ్మి ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలని రాజేష్ నిర్ణయించాడు. కొన్నాళ్ల తర్వాత సుజాతకు పెళ్లైనట్లు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు రాజేష్ తెలుసుకున్నాడు.
తనను మోసం చేసిందని సుజాతతో రాజేష్ గొడవపడ్డాడు. అప్పట్నుంచీ సుజాతను రాజేష్ దూరంగా పెట్టాడు. ‘ఒకసారి కలుద్దాం’ అని రాజేష్‌కు మెసేజ్ పెట్టింది సుజాత. అయితే.. యువకుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చనిపోతానని ఆమె బెదిరింపులకు పాల్పడింది. ‘నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను’ అంటూ రాజేష్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో సుజాతను కలుద్దామని హయత్‌నగర్‌కు రాజేష్ వెళ్లాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేష్, సుజాత వ్యవహారం కూతురు, కొడుకు తెలుసుకున్నారు. రాజేష్‌పై ముగ్గురితో కలిసి సుజాత కొడుకు దాడి చేశాడు. సుజాత చనిపోతుందన్న భయంతో రాజేష్ మందు తాగాడని రెండ్రోజుల క్రితం పోలీసులు తేల్చగా.. మరింత లోతుగా కేసును దర్యాప్తు చేయగా పైన చెప్పిన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.