ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల పోస్టులకు అప్లై చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే..!

ABN, First Publish Date - 2023-04-18T13:01:34+05:30

తెలంగాణ (Telangana)లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి

Gurukula notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2,876 పోస్టుల భర్తీకి గురుకుల నోటిఫికేషన్‌

మల్టీ జోన్ల వారీగా పోస్టుల వివరాలు

గిరిజనులకు 10% రిజర్వేషన్‌ అమలు

95 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ వర్తింపు

దరఖాస్తు సమర్పణకు గడువు మే 17

100 మార్కులకు పరీక్ష .. 100 ప్రశ్నలు

రాయడానికి రెండు గంటల సమయం

తప్పు సమాధానానికి పావు మార్కు కట్‌

మొదటి రోజు దరఖాస్తులు 50లోపే..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ (Telangana)లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి (TS Government) ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్‌ కాలేజీల్లో 2,008.. డిగ్రీ కాలేజీల్లో 868 పోస్టులు కలిపి మొత్తం 2,876 పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ట్రిబ్‌) నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే వన్‌టైం రిజిస్ట్రేషన్‌నుప్రారంభించిన ట్రిబ్‌ సోమవారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువును మే 17 సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించింది. సోమవారం ట్రిబ్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. స్థానిక రిజర్వేషన్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌తో పాటు మల్టీ జోన్‌ల వారీగా భర్తీల వివరాలను కూలంకషంగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల (ఎస్టీ) రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచిన నేపథ్యంలో అదే పది శాతాన్ని ఈ ఉద్యోగాల భర్తీలో అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే 95 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ను అమలుచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటే వారు పనిచేస్తున్న కార్యాలయాలనుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు వివరాలు..

దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600, ఇతరులకు రూ.1200. సబ్జెక్టులతో పాటు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు అవసరమైన అర్హతలు, తదితర వివరాలను కూడా నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఎవరైనా తప్పుడు పత్రాలను సమర్పిస్తే తగిన చర్యలుంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు అప్లికేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌తో పాటు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బోనఫైడ్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుది. వీటితో పాటు మరికొన్ని పత్రాలను కూడా నమోదుచేయాలి. దరఖాస్తు పూర్తిచేసుకున్న అభ్యర్ధులకు హాల్‌ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని.. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లోని గుర్తించిన సెంటర్లలో నిర్వహించనున్నామని తెలిపారు. పేపర్‌-1 ప్రశ్నపత్రం సబ్జెక్టుల వారీగా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుందని.. పేపర్‌-2, 3 మాత్రం ఎంచుకున్న భాషలు మినహా ఇంగ్లిష్‌లోనే ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పేపర్లన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. మొత్తం వంద మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 2 గంటలు. తప్పు సమాధానాలకు పావు మార్కు కట్‌ అవుతుంది. దరఖాస్తులకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే.. 040-23317140 నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీసేవతో అనుసంధానం..

గురుకుల పోస్టుల (Gurukula posts) భర్తీ నేపథ్యంలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ట్రిబ్‌ చర్యలు తీసుకుంది. ఇప్పటికే వన్‌టైం రిజిస్ట్రేషన్‌ను తీసుకురాగా.. తాజాగా తెలంగాణ ‘మీ-సేవ’ను కూడా లింక్‌ చేసుకుంది. దీని ద్వారా అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయకుండా.. ‘మీ సేవ’ నుంచి పొందిన పత్రాల్లోని కోడ్‌ను అప్లికేషన్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. వెంటనే ట్రిబ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆ కోడ్‌ను పరిశీలించుకుని.. తదుపరి వివరాల నమోదులోకి వెళ్తుంది. అయితే అప్లికేషన్‌లో పొందుపరిచిన పత్రాలన్నింటినీ వెరిఫికేషన్‌ సమయంలో అధికారులు పరిశీలిస్తారు. కనుక అభ్యర్థులు ఆ పత్రాలన్నింటినీ భద్రపరుచుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా నోటిఫికేషన్‌ విడుదలైన మొదటి రోజు దరఖాస్తులు 50 లోపే రాగా, ఇప్పటివరకూ 13వేల వన్‌ టైం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

Updated Date - 2023-04-18T13:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising