Hyderabad JNTU: సీఎస్‌ఈ పాఠాల కోసం ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్లంట..! లబోదిబోమంటున్న..!

ABN , First Publish Date - 2023-08-11T10:57:07+05:30 IST

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌ఈ) పాఠాలు బోధించేందుకు ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్లు వస్తున్నారు.! అవును.. సర్క్యూట్‌ బ్రాంచ్‌లైన ఈఈఈ(ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌), ఈసీఈ(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌), ఈఐఈ(ఎల కా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌) విభాగాలకు చెందిన అధ్యాపకులు సీఎ్‌సఈ పాఠాలు చెప్పేందుకు

Hyderabad JNTU: సీఎస్‌ఈ పాఠాల కోసం ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్లంట..! లబోదిబోమంటున్న..!

కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్లు

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీఎస్‌ఈ ఆచార్యుల కొరత

ప్రత్యామ్నాయం కోసం యాజమాన్యాల వేడుకోలు

సర్క్యూట్‌ బ్రాంచ్‌ల నుంచి 20 శాతం లెక్చరర్ల బదిలీకి జేఎన్‌టీయూ అనుమతి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌ఈ) పాఠాలు బోధించేందుకు ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్లు వస్తున్నారు.! అవును.. సర్క్యూట్‌ బ్రాంచ్‌లైన ఈఈఈ(ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌), ఈసీఈ(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌), ఈఐఈ(ఎల కా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌) విభాగాలకు చెందిన అధ్యాపకులు సీఎ్‌సఈ పాఠాలు చెప్పేందుకు జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది. ఇన్నాళ్లూ ఉన్న నిబంధన ప్రకారం ఓ అధ్యాపకుడు ఏ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారో ఆ విభాగంలోనే బోధనకు అర్హులు. కానీ, సీఎ్‌సఈ విభాగానికి ఆచార్యుల కొరత నేపథ్యంలో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు చేసిన వినతి మేరకు జేఎన్‌టీయూ ఈ వెసులుబాటు కల్పించింది. అయితే, సదరు ప్రొఫెసర్లు కంప్యూటర్‌ సైన్స్‌కు సంఽబంధించిన రెండు ఎన్‌పీటీఈఎల్‌ (నేషనల్‌ పోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌) సర్టిఫికెట్‌ కోర్సులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎ్‌సఈలో 4 వేలమంది ఆచార్యుల కొరత

మే, జూన్‌ నెలల్లో జేఎన్‌టీయూ నిర్వహించిన సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కలిపి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 2వేల మందికి పైగా ఆచార్యుల కొరత ఉన్నట్లు తేలింది. అధ్యాపకుల కొరత అంశంపై కాలేజీ యాజమాన్యాలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)ని ఆశ్రయించాయి. యాజమాన్యాల గోడు ఆలకించిన ఏఐసీటీఈ.. ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ బ్రాంచ్‌ల నుంచి 10శాతం మంది ప్రొఫెసర్లను సీఎ్‌సఈ పాఠాల బోధనకు వినియోగించుకునేందుకు అనుమతించింది. అయినప్పటికీ కొరత తీరకపోవడంతో మరో 10 శాతం మొత్తంగా 20 శాతం మందిని వినియోగించుకునేందుకు జేఎన్‌టీయూ వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ కోర్సుల్లో 55,000 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 50 వేలకుపైగా సీట్లు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోవే. నిబంధనల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ ప్రొఫెసర్‌ చొప్పున.. ఒక్కో ఏడాదికి 2,500 మంది ప్రొఫెసర్లు కావాలి. నాలుగేళ్లకు గాను పది వేల మంది అధ్యాపకులు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సిబ్బంది సంఖ్య ఆరు వేల దాకా ఉంది. దీంతో మరో 4వేల మంది సిబ్బందిని ఇతర సర్క్యూట్‌ బ్రాంచ్‌ల నుంచి తీసుకునేందుకు యాజమాన్యాలు సన్నద్ధమయ్యాయి. జేఎన్‌టీయూ కల్పించిన ఈ వెసులుబాటుపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొఫెసర్ల బయోమెట్రిక్‌ హాజరు నమోదు ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప విధానం లేకపోవడం వల్ల ప్రైవేటు కళాశాలు డమ్మీ ఫ్యాకల్టీని తెరమీదకు తెస్తాయని అంటున్నారు.

iStock-1212272730.jpg

ఎస్‌సీఎం ఇంటర్వ్యూలు లేకుండానే..

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సిబ్బందిని భర్తీ చేసేందుకు జేఎన్‌టీయూ సెలక్షన్‌ కమిటీ మీటింగ్‌(ఎన్‌సీఎం) నిర్వహిస్తుంటారు. ఆయా కాలేజీలు నియమించుకున్న ఫ్యాకల్టీ అర్హతలు, అనుభవాన్ని ఎస్‌సీఎం ఇంటర్వ్యూల్లో జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఈ ఏడాది అఫిలియేషన్‌కు గడువు సమీపిస్తుందనే కారణంగా.. ఎస్‌సీఎం ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే, కాలేజీల నుంచి వచ్చిన ఫ్యాకల్టీ దరఖాస్తులన్నింటికీ జేఎన్‌టీయూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందని, జేఎన్‌టీయూకు సమర్పించిన దరఖాస్తుల్లో 50 శాతం డమ్మీ ఫ్యాకల్టీలవేనని వర్సిటీ వర్గాలు అంటున్నాయి

Updated Date - 2023-08-11T11:06:02+05:30 IST