TS Schools: తెలంగాణలో బడుల ప్రారంభం ఎప్పట్నుంచంటే..!
ABN , First Publish Date - 2023-06-07T11:52:10+05:30 IST
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు 229 రోజుల పాటు పనిచేయనున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు పున:ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న
2023-24 విద్యాసంవత్సరానికి పాఠశాలలకు 229 పనిదినాలు
దసరా సెలవులు 13 రోజులు
సంక్రాంతి పండగకు 6 రోజులు
అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, జూన 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు 229 రోజుల పాటు పనిచేయనున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు పున:ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న స్కూళ్లకు చివరి పనిదినం. 2024, ఏప్రిల్ 24 నుంచి జూన 11 వరకు వేసవి సెలవులు. ఈ మేరకు 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను మంగళవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు 2024, జనవరి 10 కల్లా సిలబ్‌సను పూర్తిచేయాలని, అనంతరం బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యే వరకు రివిజన క్లాసులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికల్లా సిలబస్ పూర్తి చేయాలని తెలిపారు. యోగా, ధ్యానం కోసం రోజుకు 5 నిమిషాలు కేటాయించాలని సూచించారు. ఈ నెల 3న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 9 వరకు కొనసాగనుంది. పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 13 నుంచి 25 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17 వరకు ఉంటాయి. ప్రధానోపాధ్యాయులు ప్రతి నెలా మొదటి వారంలో పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలను నిర్వహించాలని, ఫిజికల్, హెల్త్, కంప్యూటర్ ఎడ్యుకేషనతో పాటు జీవన నైపుణ్యాలకు సంబంధించి ప్రాథమిక విద్యార్థులకు ప్రతి వారం 14 పీరియడ్లు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 9 పీరియడ్లు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 8 పీరియడ్లు కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.