ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: శెభాష్.. టీచర్స్! విద్యార్థుల కోసం ఏం చేశారంటే..!

ABN, First Publish Date - 2023-07-11T12:35:33+05:30

ఆ మహిళా ఉపాధ్యాయుల చొరవ ఎంతో అభినందనీయం! మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమ్మె చేయడంతో భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తారనే ఆలోచనతో వంట చేసేందుకు నడుంకట్టారు. చక్కగా వంట చేయడమే కాదు.. పిల్లలందరికీ ఆ ఆహార పదార్థాలను వడ్డించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్లే గరిట తిప్పి.. వడ్డించి..

బడి పిల్లల కోసం మహిళా ఉపాధ్యాయుల చొరవ

సమ్మెలోకి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు

కూరగాయలు తెచ్చి మెనూ ప్రకారం టీచర్ల వంటకాలు

నల్లగొండ జిల్లా ఇండ్లూరులో 140 మంది పిల్లలకు భోజనం

తిప్పర్తి, జూలై 10: ఆ మహిళా ఉపాధ్యాయుల చొరవ ఎంతో అభినందనీయం! మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమ్మె చేయడంతో భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తారనే ఆలోచనతో వంట చేసేందుకు నడుంకట్టారు. చక్కగా వంట చేయడమే కాదు.. పిల్లలందరికీ ఆ ఆహార పదార్థాలను వడ్డించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలోని ఐదుగురు మహిళా ఉపాధ్యాయుల చొరవ ఇది. తిప్పర్తి మండల వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన నిర్వహణ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నారు.

మండలంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులంతా బడికి వచ్చేటప్పుడే లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు ముందే సూచించారు. ఇంకొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు తాత్కాలిక వర్కర్లను పెట్టి వంటలు చేయించారు. ఇండ్లూరు పాఠశాలలో మాత్రం తాత్కాలిక వర్కర్లు దొరకలేదు. ఈ బడిలో 178 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక హెచ్‌ఎంతో పాటు ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడ బోధిస్తున్నారు. సోమవారం 140 మంది విద్యార్థులు బడికి వచ్చారు. వీరందరినీ లంచ్‌ కోసం ఇంటికి వదిలిపెట్టాలని అనుకున్నా, తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళతారని, భోజనం పెట్టేవారు ఉండరని ఉపాధ్యాయులు భావించారు. దీంతో తామే వంట చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు. స్వయం గా కూరగాయలు, వంట దినుసులు తెచ్చి ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు కలసి మెనూ ప్రకారం భోజనం తయారు చేశారు. అనంతరం పిల్లలందరికీ వడ్డించారు.

Updated Date - 2023-07-11T12:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising