TS ICET: తెలంగాణ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్
ABN , First Publish Date - 2023-06-29T16:58:49+05:30 IST
కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించారు.
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్-2023 (TS ICET - 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించారు. పరీక్షకు 70,900 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 61,092 అభ్యర్థులు అర్హత సాధించారు. నెల రోజుల్లో అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి ర్యాంక్ సూర్యాపేట జిల్లాకి చెందిన నూకల శ్రావణ్ కుమార్ సాధించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేయూ వీసీ ప్రొఫెసర్ రమేష్, ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి పాల్గొన్నారు.