Education: తెలంగాణ స్కూల్స్ అంతంతే! పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్‌లో వెనుకంజ!
ABN, First Publish Date - 2023-07-08T12:45:27+05:30
విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్‌లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది.
పనితీరులో తెలంగాణ వెనుకంట
పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్‌లో 31వ స్థానం
16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్‌లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా రూపొందించిన ‘పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ సూచీ 202122’ నివేదికను కేంద్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 31వ స్థానంలో నిలిచింది. 1,000 స్కోరుకుగానూ తెలంగాణ 479.9 స్కోరు మాత్రమే సాధించింది. ప్రామాణికాల వారీగా చూస్తే లెర్నింగ్ ఔట్‌కమ్ నాణ్యతలో 240కి గాను 36.6 స్కోరు, యాక్సెస్(పాఠశాలల అందుబాటు)లో 80కి 53.7, మౌలిక సదుపాయాలుసౌకర్యాల్లో 190కి 56.2, సమానత్వంలో 260కి 219.5, పరిపాలనలో 130కి 53.3, ఉపాధ్యాయుల విద్య శిక్షణలో100కి 60.6 స్కోరు మాత్రమే రాష్ట్రానికి లభించింది. మరోపక్క, ఈ ర్యాంకింగ్స్‌లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానంలో నిలిచింది. మొత్తం 1000కిగాను 543.8 స్కోరు సాధించిన ఏపీ పీజీఐ సూచీలో దేశంలోనే 16వ స్థానంలో నిలిచింది. గ్రేడింగ్‌లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ‘ఆకాంక్షి1’ గ్రేడ్ సాధించింది. కాగా, ఈ స్కోరింగ్‌లో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన చండీగఢ్(659.0), పంజాబ్(647.4)లు ప్రచేష్ఠ2 గ్రేడ్ దక్కించుకున్నాయి.
Updated Date - 2023-07-08T12:45:27+05:30 IST