TS TET: తెలంగాణలో మరోసారి ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల
ABN, First Publish Date - 2023-08-01T14:51:42+05:30
తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది (TET notification). సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఒకసారి విద్యాశాఖ టెట్ పరీక్ష నిర్వహించింది. కానీ డీఎస్సీ ఎప్పుడు అనేది మాత్రం విద్యాశాఖ క్లారిటీ ఇవ్వలేదు. గతేడాది టెట్ నిర్వహించిన ప్రభుత్వం.. వెంటనే నోటిఫికేషన్ ఇస్తుందని నిరుద్యోగులంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 మే 22, 2017 జులై 23, 2022 జూన్ 12న టెట్ పరీక్షలు నిర్వహించారు. మళ్లీ వచ్చే సెప్టెంబర్‌లో టెట్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు 20 వేలకు పైగా ఉన్నారు. గత కొంతకాలంగా మరో టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను జరపాలని అశావాహులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి నిర్వహించబోయే పరీక్షకు కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈసారైనా ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారేమోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Updated Date - 2023-08-01T15:21:13+05:30 IST