School Admissions: అడ్మిషన్లు తీసుకునేముందు జర జాగ్రత్త!
ABN, First Publish Date - 2023-05-31T12:33:23+05:30
గండిపేట మండలంలో విద్యాశాఖ అధికారుల తీరుకు అనధికార పాఠశాలల జాబితా ఇంతవరకు వెలుగు చూడలేదు. ప్రతి ఏడాది
చదువు ‘కొనేముందు’ జాగ్రత్త
మొదలైన అడ్మిషన్ల హడావిడి
గుర్తింపులేని పాఠశాలల జాబిత ప్రకటించని అధికారులు
(హైదరాబాద్, నార్సింగ్ - ఆంధ్రజ్యోతి): గండిపేట మండలంలో విద్యాశాఖ అధికారుల తీరుకు అనధికార పాఠశాలల జాబితా ఇంతవరకు వెలుగు చూడలేదు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరానికి ముందు విద్యాశాఖ ఆదేశాల మెరకు ఆయా మండలాల్లోని అనధికార/గుర్తింపులేని పాఠశాలల జాబితాను ప్రకటిస్తారు. పలు మండలాల్లోని పాఠశాల జాబితా బయట పడినా గండిపేట మండ లంలోని జాబితా ఇంతవరకు వెలుగు చూడలేదు. అధికారు ల తీరుపై విద్యార్థుల తల్లితండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రితం ఏడాది మొత్తం పాతికకు పైగా అనధికార పాఠశాలల జాబితాను ప్రకటించిన అధికారులు ఈ సారి మాత్రం మీనవేషాలు లెక్కిస్తున్నారు. ఈ ప్రాంతంలో బడా బాబులు, రాజకీయ నాయకులకు చెందిన పాఠశాలలు అధికంగా ఉండడం వలన అధికారులు మౌనం వహిస్తున్నారనేది బహిరంగ ఆరోపణ. క్రితం ఏడాది ఈ మండలంలో రెండు పాఠశాలలు చెప్పా పెట్టకుండా మూసివేశారు. దీంతో ఆ పాఠశాలల పిల్లలు రోడ్డున పడ్డారు.
పోలీసుల విచారణలో గుర్తింపు..
నార్సింగ్‌లోని ఓ పాఠశాలలో టీచర్ ఓ విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాగా, అసలు పాఠశాలకు అనుమతే లేదని పోలీసుల విచారణలో తేలింది. ఇదే మండలంలో నాలుగు పాఠశాలలు నాలుగు ఏళ్లలో బిచానా ఎత్తివేశాయి. మరి అధికారుల కంట్రోల్‌లో ఎముందో అర్థంకాని వ్యవహార. గండిపేట్ మండలంలో వీధికో పాఠశాల చొప్పున ప్రారంభిస్తున్నారు. క్రితం ఏడాది కంటే ఈ సారి యాభై పాఠశాలలు కొత్తగా గండిపేట మండలంలోని వివిధ కాలనీలు, గ్రామాల్లో ప్రారంభిస్తున్నారు. దీంతో పాఠశాల సంఖ్య వందకు పైగా దాటిపోయింది. ఈ సారి మొత్తం పాఠశాలల సంఖ్య 300కి చేరుకున్నా అనుమానం లేదు. స్కూల్ అడ్మిషన్‌లను వలవేసి పట్టుకునేందుకు కొత్త కొత్త విద్యా సంస్థలు పుట్టుకోస్తున్నాయి. ఈ ప్రాంతంలో జనాభ పెరగడం, జనావాసాలు విస్తరించడంతో ఎక్కడి ఎక్కడి నుంచో విద్యాలయాలు వచ్చి వాలాయి. ట్యాలెంట్, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్, ఒలపింయా డ్, వరల్డ్ లేవల్, నేషనల్ అనే ట్యాగ్ లైన్లతో రకరకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇందులో కొన్నింటికి ప్రభుత్వ అనుమతులు ఉండగా, మరికొన్ని బ్రాంచ్‌ల పేరుతో నడిపిస్తున్నాయి. మరికొన్నింటికి అనుమతులే ఉండవనేది వాస్తవం.
రిజిస్ర్టేషన్ వేరు రికన్గైజేషన్ వేరు..
ప్రతి పాఠశాల ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రికన్గైజేషన్ పొందాలి. ఇది నిబంధన. చాలా పాఠశాల బోర్డులు చూసి నా, ప్రకటనలు చేసినా అందులో ‘‘గవర్నమెంట్ రిజిస్టర్డ్’’ అని రాస్తుంటారు. రిజిస్టర్డ్ ఎవరైనా చేసుకోచ్చు. కాని విద్యాశాఖ నుంచి రికన్గైజేషన్ ఖచ్చితంగా తీసుకున్న పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతలు తీసుకోకున్నా పాఠశాలలు నడిపేవారు, ఇతర పాఠశాలల నుంచి పరీక్షలకు విద్యార్థులను కూర్చోబెడతారు. ఈ విధంగా పరీక్ష రాసిన వారిని ప్రభుత్వవం ప్రైవేట్ విద్యార్థిగానే పరిగణిస్తుంది. బ్రాంచ్‌ల పేరుతో పాఠశాలలు నడిపేవారు బ్రాంచ్‌కు విద్యాశాఖ అనుమంతి ఉందా చూసుకోవా లి. లేదంటే వారు ఆ బ్రాంచ్ విద్యార్థులను వారికి ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచ్ నుంచి పరీక్షలు రాయిస్తుంటారు. ఈ గుర్తింపు విషయంలో తల్లితండ్రులు మొహమాటానికి వెళ్లకుండా ఖచ్చితంగా అనుమతి పత్రాలు అడిగి తెలుసుకుంటే మంచింది.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
పాఠశాలల వారు అడ్మిషన్‌లను పెంచుకునేందకు విద్యార్థుల తల్లితండ్రలును ఆకర్షించేందుకు వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తుంటారు. మా పాఠశాలలో ఫనాలా సౌకర్యాలు ఉన్నాయి... ఈ విధంగా తర్ఫిదు ఇస్తామం... ప్లేగ్రౌండ్ ఉందంటూ.. హంగామా క్రిటే చేస్తూ చెబుతుంటారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. క్రీడా మైదానాలు లేని పాఠశాల జోళికి, అపార్టుమెంట్ భవనాల్లో, ఇరుకు సందుల్లో ఉన్న పాఠశాల జోళికి వెళ్లకండి. విద్యార్థులు శారిరకంగా, మానసికంగా ఎదిగేందుకు క్రీడలు ఎంతో అవసరం. ప్రతి పాఠశాలకు మెదానాలు ఉండాలని ప్రభు త్వం చెబుతోంది. క్రీడా మైదానాలు లేకుంటే మన పిల్లల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఇరుకు గదుల్లో, సందులో ఉండే పాఠశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినా, భారీ నష్టం జరుగుతుంది. ఇలాంటి పాఠశాలలకు ఫైర్ స్టేషన్ అనుమతి కూడా ఉండదు. ఇలాంటి పాఠశాల జోలికి వెళ్లకండి. ఇతరాత్ర సేఫ్టీ ప్రెకాషన్స్ తీసుకున్నారా లేదా.. పరిశీలించాలి. ఇప్పటికు టాయిటెల్స్ కూడా సరిగ్గాలేని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయంటే అది నమ్మలేని నిజం. పాఠశాలలో వెళ్లి అడ్మిషన్ తీసుకునే సమయంలో మొహమాటం పడకుండా వివరాలు కనుక్కొని పిల్లకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చే విధంగా చూసుకోండి. ఎలాంటి విచారణలు చేపట్టకుండా మనం అడ్మిషన్‌లు ఇప్పించి అందులో వేస్తే మన పిల్లల భవిష్యత్‌ను మనమే పాడు చేసినట్టువుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Updated Date - 2023-05-31T12:33:23+05:30 IST