ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC: గ్రూప్‌ 4 అభ్యర్థులకు శుభవార్త! ఎన్నికల షెడ్యూల్‌లోపే..!

ABN, First Publish Date - 2023-07-05T10:57:52+05:30

త్వరలోనే గ్రూప్‌4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 8 వేలకు పైగా ఉన్న గ్రూప్‌4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో గ్రూప్‌ 4 ఫలితాలు?

అధికారుల కసరత్తు.. ఎన్నికల షెడ్యూల్‌లోపే పోస్టుల భర్తీకి చాన్స్‌

నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి కోసం సర్కారు యత్నం

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే గ్రూప్‌4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 8 వేలకు పైగా ఉన్న గ్రూప్‌4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అతిత్వరలో గ్రూప్‌4 ఫలితాలను వెల్లడించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్‌4 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1న పరీక్ష నిర్వహించారు. ఈ ఉద్యోగాల కోసం 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 80% మంది పరీక్ష రాశారు. ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించే మార్కులను ప్రకటించనున్నారు. ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లా, జోనల్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్‌ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయనున్నారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసి, తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్‌ నవంబరు లేదా డిసెంబరులో విడుదలయ్యే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. ఆ లోపు గ్రూప్‌4 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-07-05T10:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising