9 Hours Sleep: రోజుకు 9 గంటలు నిద్రపోతే ఇన్ని అనారోగ్య సమస్యలొస్తాయని తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-04T14:05:08+05:30 IST

మనిషికి 8 గంటల నిద్ర చాలా ఉపయోగకరం. అది లేదంటే కనీసం 6:30 గంటల పాటు నిద్ర సరిగ్గా సరిపోతుంది. ఇంతకంటే తక్కువైన డేంజరే..

9 Hours Sleep: రోజుకు 9 గంటలు నిద్రపోతే ఇన్ని అనారోగ్య సమస్యలొస్తాయని తెలిస్తే..

మనిషికి 8 గంటల నిద్ర చాలా ఉపయోగకరం. అది లేదంటే కనీసం 6:30 గంటల పాటు నిద్ర సరిగ్గా సరిపోతుంది. ఇంతకంటే తక్కువైన డేంజరే.. 8 గంటల కంటే ఎక్కువైనా డేంజర్. అతి అన్ని వేళలా అనర్ధమని ఎప్పుడో పెద్దలు చెప్పారు. మరి 9 గంటల పాటు నిద్ర పోతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.

హైపర్‌సోమ్నియా..

వ్యక్తి సాధారణ నిద్ర కంటే ఎక్కువగా నిద్ర పోతే ఆ కండీషన్‌ని హైపర్‌సోమ్నియా అంటారు.

తలనొప్పి

కొందరు వీకెండ్ కానీ వెకేషన్‌లో కానీ సాధారణ సమయం కంటే ఎక్కువగా నిద్ర పోతారు. ఇది తలనొప్పికి కారణం అవుతుంది.

ఒబెసిటీ..

అతి నిద్ర అనేది అధిక బరువుకు కూడా కారణమవుతుంది.

బ్యాక్ పెయిన్..

అతి నిద్ర కారణంగా ఎక్కువ సేపు పడుకుని ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువేనట.

డిప్రెషన్

అతి నిద్ర డిప్రెషన్‌కు కారణమవుతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

హృదయ సంబంధింత సమస్యలు..

9 గంటల పాటు నిద్ర పోయే వారు హృదయ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువేనట.

డెత్ రేట్ ఎక్కువ

9 గంటలు.. అంతకంటే ఎక్కువ సమయం నిద్రించే వారిలో సాధారణంగా 8 గంటలు అంతకంటే తక్కువ నిద్రించే వారితో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువ

Updated Date - 2023-04-04T14:08:56+05:30 IST