ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covidపై ఫైట్ చేసినట్లే Omicron BF7పై కూడా..

ABN, First Publish Date - 2023-01-03T11:42:17+05:30

కొవిడ్‌ (covid) మీద విజయం సాధించాం. వ్యాక్సిన్ల (vaccines)తో వైర్‌సకు అడ్డుకట్ట వేయగలిగాం. అలాగే హెర్డ్‌ ఇమ్యూనిటీ (Immunity)ని కూడా సాధించాం. అయితే అంతమాత్రాన కొవిడ్‌ అన్ని వేరియెంట్ల మీదా పై చేయి సాధించామని అనుకోడానికి

Omicron BF7తో ఇలా పోరాడదాం!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ (covid) మీద విజయం సాధించాం. వ్యాక్సిన్ల (vaccines)తో వైర్‌సకు అడ్డుకట్ట వేయగలిగాం. అలాగే హెర్డ్‌ ఇమ్యూనిటీ (Immunity)ని కూడా సాధించాం. అయితే అంతమాత్రాన కొవిడ్‌ అన్ని వేరియెంట్ల మీదా పై చేయి సాధించామని అనుకోడానికి వీల్లేదు. వ్యాక్సిన్లతో కొవిడ్‌ నుంచి పూర్తి స్థాయి రక్షణ ఉండదు. అవి ఇన్‌ఫెక్షన్‌ (Infection) తీవ్రతను కొంత మేరకు తగ్గించగలుగుతాయంతే! ఐరోపాలో ఇప్పటికే ముందస్తు నాల్గవ డోసును ఇస్తున్నారు. కానీ మన దేశంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా బూస్టర్‌ డోసుల(Booster doses) దశకే చేరుకోలేదు. అయినప్పటికీ బూస్టర్‌ లేదా ప్రికాషనరీ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంటే తీసుకోవడమే ఉత్తమం. దాంతో ఒమిక్రాన్‌(Omicron) కొత్త వేరియెంట్‌ బిఎఫ్‌7 (BF7) సోకినా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తగ్గుతుంది.

మళ్లీ అవే జాగ్రత్తలు

ప్రస్తుత బిఎఫ్‌7 వేరియెంట్‌, తేలికగా వ్యాప్తి చెందే తత్వం కలిగి ఉంది. అయితే సాధారణంగా ఎలాంటి కొత్త పాండమిక్‌ అయినా తక్కువ తీవ్రతతోనే విస్తరిస్తుంది. కాబట్టి ఈ వైరస్‌ సోకినా శ్వాసకోస ఇన్‌ఫెక్షన్‌, జ్వరం లాంటి లక్షణాలే వేధిస్తాయి. కొందర్లో జీర్ణకోశ సమస్యలు, పలుచని విరోచనాలు లాంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అయితే గర్భిణులు, పెద్దలు, కొమార్బిడ్‌ కోవకు చెందిన వ్యక్తుల మీద ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండే వీలుంది. కాబట్టి వీళ్లు అప్రమత్తంగా ఉండాలి. మునుపటి లాగే భౌతిక దూరాలు పాటించడం, జనసమ్మర్ధ ప్రదేశాలకు దూరంగా ఉండడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడంతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్‌ ధరించడం అవసరం.

ఇలా అప్రమత్తం

కొవిడ్‌ వ్యాప్తి చెంది ఉన్న సమయంలో కొవిడ్‌ను పోలిన లక్షణాలు మొదలైనప్పుడు, వాటికి ఇతరత్రా రుగ్మతలు కారణం కాదని నిర్థారణ అయిన సందర్భంలో కచ్చితంగా కొవిడ్‌ చికిత్స తీసుకోవలసిందే! కొవిడ్‌ చికిత్సలో ప్రొటీన్‌ ఇన్‌హిబిటర్స్‌ అనే కొత్త డ్రగ్స్‌ ప్రస్తుతం అందుబాటులోకొచ్చాయి. తాజా వేరియెంట్‌కు కూడా వీటినే వాడుకోవలసి ఉంటుంది. జ్వరం 48 గంటలకు మించి కొనసాగినా, దగ్గుతో పాటు శ్వాస ఇబ్బంది తలెత్తినా, ఆయాసం మొదలైనా, విపరీతమైన బలహీనత ఆవరించినా కొవిడ్‌గా అనుమానించి, వీలైనంత వెంటనే వైద్యులను సంప్రతించాలి. అయితే కొమార్బిడ్‌ కోవకు చెందిన మధుమేహులు, హృద్రోగులు, హైపర్‌టెన్షన్‌, కేన్సర్‌ రోగులు, పెద్దలు... లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రతించడం మేలు.

ఇమ్యూనిటీ ఇలా పెంచుకుందాం

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లు, నిమ్మ జాతి పండ్లు, పుచ్చకాయలు, డ్రైఫ్రూట్స్‌తో పాటు సమతులాహారం తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, బయటి ఆహారం మానేసి, ఇంటి భోజనానికే పరిమితం కావాలి. ఆహారంలో కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రాణాయామం, నడక, జాగింగ్‌ చేస్తూ ఉండాలి.

-డాక్టర్‌ శశికిరణ్‌

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌;

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.

Updated Date - 2023-01-03T11:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising