ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంపై పాకిస్తానీ యువకుడు సంచలన వ్యాఖ్యలు.. సెటైర్ల మీద సెటైర్లు వేశాడుగా!

ABN, First Publish Date - 2023-08-24T17:40:55+05:30

సాధారణంగా భారత్ ఏదైనా ప్రతిష్టాత్మక విజయం సాధిస్తే.. దానిపై దాయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ అసూయ వెళ్లగక్కుతుంది. భారత్ కంటే తామే గొప్ప అనేలా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంది. పాకిస్తానీ యువత కూడా అంతే...

సాధారణంగా భారత్ ఏదైనా ప్రతిష్టాత్మక విజయం సాధిస్తే.. దానిపై దాయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ అసూయ వెళ్లగక్కుతుంది. భారత్ కంటే తామే గొప్ప అనేలా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంది. పాకిస్తానీ యువత కూడా అంతే. దాదాపు ఎక్కువమంది భారత్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటారు. కానీ.. ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. ఎప్పుడైతే పాక్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో విలవిలలాడుతోందో.. పాకిస్తానీయులు స్వయంగా తమ దేశం పరువే తీసుకుంటున్నారు. తమ కంటే భారత్ ముందుకు దూసుకెళ్లిపోతోందని, ఆ దేశాన్ని చూసి పాక్ నేతలు చాలా నేర్చుకోవాలంటూ సలహాలూ ఇస్తున్నారు. తమ దేశ పరిస్థితిపై తామే సెటైర్లు వేసుకుంటున్నారు.


ఇప్పుడు ఓ పాకిస్తాని యువకుడు కూడా అదే పని చేశాడు. చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ సరికొత్త చరిత్ర లిఖించిన నేపథ్యంలో.. పాక్ పరువు పోయేలా తమ దేశంపై కౌంటర్లు వేశాడు. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు అతడు జవాబిస్తూ.. ‘‘వాళ్లు (భారత్) డబ్బులు పెట్టి మరీ చంద్రుడి మీదకు వెళ్తున్నారు. కానీ మనం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం’’ అని బదులిచ్చాడు. ‘అదేంటి.. మనం ఉండేది భూమిపై కదా’ అని ఆ జర్నలిస్ట్ అడగ్గా.. ‘‘చంద్రుడి మీద నీళ్లున్నాయా?’’ అని ప్రశ్నించాడు. అందుకు జర్నలిస్ట్ లేవని సమాధానం ఇచ్చాడు. దాంతో.. పాక్‌లో కూడా నీళ్లు లేవని ఆ యువకుడు పేర్కొన్నాడు. అలాగే.. చంద్రుడి మీద గ్యాస్, కరెంట్ వంటివి ఉన్నాయా? అని అతడు ప్రశ్నించగా.. అవి కూడా లేవని జర్నలిస్ట్ జవాబిచ్చాడు. పాక్‌లో కూడా కరెంట్, గ్యాస్ లేవని ఆ యువకుడు వ్యాఖ్యానించాడు. ఇలా అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్న తరుణంలో.. ఆ యువకుడు పై విధంగా తమ దేశంపైనే వ్యంగ్యాస్త్రాలు చేసినట్టు స్పష్టం చేసుకోవచ్చు. పెట్రోల్, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలన్నీ ఆకాశాన్నంటడంతో.. అక్కడ ప్రజలు జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడం కూడా వారికి కష్టంగా మారింది. అందుకే.. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో.. అతని హ్యూమర్‌ని కొనియాడుతూ నెట్టింట్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించింది. ఒకప్పుడు ఇస్రోను ఎగతాళి చేసిన పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి.. ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తారు.

Updated Date - 2023-08-24T17:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising