ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19: ఒక్కసారి కరోనా సోకితే చాలు.. ఇక అంతా హ్యాపీ.. చైనాలో మరో ట్రెండ్..

ABN, First Publish Date - 2023-01-06T19:50:44+05:30

చైనాలో కొత్త ట్రెండ్.. అక్కడి యువత కరోనా బారిన పడాలని తెగ ఉబలాటపడుతోంది. కరోనా వ్యాధిగ్రస్థుల పక్కన చేరి ఇన్ఫెక్షన్‌ను కొని తెచ్చుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రస్తుతం ప్రపంచం కరోనా(Covid-19) భయంతో గజగజా వణికిపోతోంది. ఇక చైనా(China) పరిస్థితి మరీ దారుణం. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగడం..ఆస్పత్రి బెడ్లకు కొరత ఏర్పడటం తదితర సమస్యలతో అల్లాడుతోంది. ఇలాంటి స్థితిలో అప్రమత్తంగా ఉండాల్సిన చైనా యువత(Chinese Youth) కరోనా బారిన పడాలని తెగ ఉబలాటపడుతోంది. కరోనా వ్యాధిగ్రస్థుల పక్కన చేరి ఇన్ఫెక్షన్‌ను కొని తెచ్చుకుంటోంది(Self infecting). నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) ప్రారంభం కాకమునుపే కరోనా బారిన పడి కోలుకోవాలనేది అక్కడి వారి ప్లాన్. తద్వారా..రోగనిరోధకశక్తి బలపడి వేడుకల సమయంలో కరోనా దరి చేరదని వారు భావిస్తు్న్నారు. చివరి నిమిషంలో కరోనా బారిన పడితే తమ ప్లాన్లు పట్టాలు తప్పుతాయని భావిస్తున్న కొందరు యువత ఇలాంటి పరిష్కారాన్ని అవలంబిస్తున్నారు. మరి కొందరేమో సెలవులు, వేడుకలతో నిమిత్తం లేకుండా కరోనా బారిన పడాలని కోరుకుంటున్నారు. అయితే.. గతంలోనూ కొన్ని దేశాల్లో ఈ ట్రెండ్ కనిపించింది. టీకాలను వ్యతిరేకించిన పలువురు కావాలనే కరోనా బారినపడాలని అప్పట్లో ప్రయత్నించారు. సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేశారు. చైనా యువత మాత్రం తమదైన కారణాలతో ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.

Updated Date - 2023-01-06T19:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising