ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam : ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ కంటి తుడుపు చర్య : ఈడీ

ABN, First Publish Date - 2023-02-28T16:57:40+05:30

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)

Manish Sisodia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కేవలం కంటి తుడుపు చర్య అని, ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అమలు చేయాలనే ఆసక్తితో దీనిని నిర్వహించలేదని వెల్లడైంది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ప్రస్తుతం సీబీఐ (Central Bureau of Investigation) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈడీ గత నెలలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రత్యేకంగా నియమించుకున్న కొన్ని ప్రజా సంబంధాల కంపెనీలు ఈ మద్యం విధానాన్ని రూపొందించే సమయంలో, దానిని ప్రభావితం చేయడం కోసం దాదాపు 4,000 ఈ-మెయిల్స్‌ను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాయి. ఎక్సయిజ్ విధానాన్ని ‘‘ఓ పద్ధతిలో’’ తయారు చేయాలని తనను మనీశ్ సిసోడియా కోరారని DANICS అధికారి సీ అరవింద్ ఈడీకి తెలిపారు. హోల్‌సేల్ లాభం 12 శాతంగా నిర్ణయించడంపై మంత్రుల బృందం సమావేశాల్లో చర్చించలేదు. 2021 మార్చిలో సీ అరవింద్‌ను అకస్మాత్తుగా మనీశ్ సిసోడియా పిలిచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి రావాలని చెప్పారు. కేజ్రీవాల్ నివాసంలో ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఉన్నారు. అక్కడే ఉన్న సిసోడియా ఓ డాక్యుమెంట్‌ను సీ అరవింద్‌కు ఇచ్చారు. అది మంత్రుల బృందం (జీఓఎం) ముసాయిదా నివేదిక. హోల్‌సేల్ మార్జిన్‌ను 12 శాతంగా ఈ డాక్యుమెంట్ ప్రతిపాదించింది. దీని ఆధారంగా డ్రాఫ్ట్ జీఓఎం రిపోర్టును తయారు చేయాలని అరవింద్‌ను ఆదేశించారు.

ఈ విధాన రూపకల్పనను ప్రభావితం చేయడం కోసం సుమారు 4,000 ఈ-మెయిల్స్‌ను అధికారులకు పంపించారు. దీని వెనుక కుట్రలో బినయ్ బాబు పాత్ర కూడా ఉందని దర్యాప్తులో తేలింది. ISWAI నియమించిన మీడియా ఏజెన్సీల ద్వారా వీటిని పంపించినట్లు వెల్లడైంది. సాధారణ ప్రజానీకం ప్రభుత్వ అధికారులకు వీటిని పంపించినట్లుగా చూపించేందుకు వీలుగా ఈ-మెయిల్ ఐడీలను సృష్టించినట్లు వెల్లడైంది.

పాత విధానంలోని రిటెయిలర్‌కు అనుకూలంగా నిపుణుల కమిటీ నివేదిక లేకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. ఆ రిటెయిలర్‌కు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేసినట్లు వెల్లడైంది. నియమించుకున్న రెండు ఏజెన్సీలు దాదాపు 3,000 ఈ-మెయిల్ ఐడీలను సృష్టించాయని, వివిధ వర్గాల ద్వారా మరొక 1,000 ఈ-మెయిల్ ఐడీలను ఏర్పాటు చేశాయని ఈడీ పేర్కొంది. వీటి ద్వారా 4,000 ఈ-మెయిల్స్‌ను నిపుణుల కమిటీ నివేదికకు అనుకూలంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారని, ఈ డ్రాఫ్ట్‌ను ముందుగానే క్రియేట్ చేశారని తెలిపింది.

మంత్రుల బృందం (GoM)లో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ ఉన్నట్లు తెలిపింది. సిసోడియా, జైన్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. నిపుణుల కమిటీ నివేదికను, స్టేక్‌హోల్డర్స్/సాధారణ ప్రజానీకం నుంచి వచ్చిన వ్యాఖ్యలను కేబినెట్ ముందు పెట్టారని, ప్రస్తుత వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఈడీ తెలిపింది. విధానాన్ని సమూలంగా మార్చుతున్న సమయంలో, తగినంత సమయం అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజల అభిప్రాయాలను కోరలేదని పేర్కొంది. తుది విధానాన్ని 2021 జూలై 5న ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

United Nations : నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి ఐరాస సమావేశానికి హాజరు!

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

Updated Date - 2023-02-28T16:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!